Bigg Boss 8 Telugu: ఆసక్తి రేకెత్తిస్తోన్న బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్ లిస్ట్.. తెరపైకి కొత్త పేరు..
Bigg Boss 8 Telugu Contestants List: ఇక కొత్తగా ప్రారంభం కానున్న సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరెవరు పాల్గొననున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొందరి పేర్లు సైతం వైరల్ అవుతున్నాయి.
Bigg Boss 8 Telugu Contestants List: అన్ని భాషల్లో లాగే తెలుగులోనూ బిగ్ బాస్ రియాలిటీ షోకు ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 7 సీజన్స్ విజయవంతంగా పూర్తికాగా తాజాగా కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఇప్పటికే విడుదలైన బిగ్ బాస్8 ప్రోమో సైతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. గత సీజన్‌లో సామాన్యుడు పల్లవి ప్రశాంత్ టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
ఇక కొత్తగా ప్రారంభం కానున్న సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరెవరు పాల్గొననున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొందరి పేర్లు సైతం వైరల్ అవుతున్నాయి. వీటిలో రీతూ చౌదరి, నటి సన, మై విలేజ్ షో అనిల్, యాదమరాజు, అంజలి పావని, యాంకర్ వింధ్య, కిర్రాక్ ఆర్పీ, బంచిక్ బబ్లు, గాయత్రి గుప్తా, కుమారి ఆంటీ వంటి పేర్లు ఉన్నాయి. వీరితో పాటు వేణు స్వామి కూడా బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టనున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఇక వీరితో పాటు న్యూస్ రీడర్ కళ్యాణి, రేఖ భోజ్, ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర, సీరియల్ నటుడు ఇంద్రనీల్, హీరో అబ్బాస్, రోహిత్, సింగర్ సాకేత్, ఊర్మిళ చౌహాన్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వార్తల్లో నిలిచిన బర్రెలక్క కూడా బిగ్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బర్రెలక్క అలియాస్ సిరి.. యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈమె ధైర్యాన్ని చూసి చాలా మంది సపోర్ట్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొందరు స్వచ్ఛందంగా వచ్చి బర్రెలక్కకు మద్ధుతుగా ప్రచారం కూడా చేశారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ సపోర్ట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారు. మరి బర్రెలక్క నిజంగానే బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నందా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.