Bigg Boss 8 Telugu 7th Week Elimination: ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు?

7th Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది.

Update: 2024-10-19 12:37 GMT

Bigg Boss 8 Telugu 7th Week Elimination: ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు?

Bigg Boss 8 Telugu 7th Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు ఆరుగురు హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ కాగా మధ్యలో కొందరు కంటెస్టెంట్స్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, నైనిక, ఆదిత్య ఓం, సీత హౌజ్‌ నుంచి నిష్క్రమించారు. కాగా ప్రస్తుతం షో రసవత్తరంగా సాగుతోంది.

వీకెండ్ రావడంతో ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరన్న చర్చ అందరిలోనూ నెలకొంది. దీంతో ఈసారి బయటకు వెళ్లేది వీరంటే, వీరంటూ సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తు చర్చ నడుస్తోంది. ఈవారం ఎలిమినేషన్‌లో మొత్తం 9 మంది ఉన్న విషయం తెలిసిందే. నిఖిల్, పృథ్వీ, నబీల్, మణికంఠ, ప్రేరణ, యష్మి, గౌతమ్, హరితేజ, టేస్టీ తేజలు ఈ వారం ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్నారు.

కాగా వీరిలో నబీల్‌.. మంచి ఆటతీరును కనబరుస్తూ గేమ్‌లో టాప్‌లో కొనసాగుతున్నాడని ఆయనకు వచ్చిన ఓటింగ్స్‌ చెబుతున్నాయని టాక్‌ నడుస్తోంది. ఇక ఓటింగ్‌ పరంగా తర్వాత స్థానాల్లో నిఖిల్, మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, యష్మి, హరితేజ, టేస్టీ తేజ, గౌతమ్ ఉన్నారని సమాచారం. అయితే పృథ్వీకి మాత్రం క్రమంగా నెగిటివీ పెరుగుతోందని టాక్‌ నుడస్తోంది నడుస్తోంది.

ముఖ్యంగా నామినేషన్‌ సమయంలో అవినాష్ భార్య గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో పృథ్వీకి ఈసారి నెగిటివ్‌ ఓటింగ్ తప్పదని అంతా భావిస్తున్నారు. అయితే ఓటింగ్ విషయంలో మాత్రం పృథ్వీ బయటపడతాడనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. ఎటొచ్చి టేస్టీ తేజ, గౌతమ్‌ ఇద్దరూ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు అర్థమవుతోంది. వీరిద్దరిలో ఒకరు ఈవారం ఎలిమిమేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరి ఈ వారం హౌజ్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

Tags:    

Similar News