Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఆటకు రంగం సిద్ధం.. ఆ రోజు నుంచే షురూ.. ప్రకటించిన మేకర్స్‌..!

Bigg Boss 7 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్ ఆటకు రంగం సిద్ధమైంది. 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ తెలుగు రియాలిటీ షో.. మరో సీజన్‌కు తయారైంది.

Update: 2023-08-22 15:45 GMT

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఆటకు రంగం సిద్ధం.. ఆ రోజు నుంచే షురూ.. ప్రకటించిన మేకర్స్‌..!

Bigg Boss 7 Telugu: బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్ ఆటకు రంగం సిద్ధమైంది. 6 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ తెలుగు రియాలిటీ షో.. మరో సీజన్‌కు తయారైంది. ‘ఈసారి మాములుగా ఉండదు. ఉల్టా పల్టా’ అంటూ ప్రోమోలతో నాగర్జున హైప్‌ క్రియేట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌‌పై కీలక అప్డేట్‌ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సెప్టెంబర్‌ 3 నుంచి బిగ్‌బాస్‌ 7వ సీజన్‌ మొదలవుతుందని బిగ్‌బాస్‌ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బిగ్ బాస్ 7 వ సీజన్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోలో రమేశ్‌, రాధ అనే ఇద్దరు లవర్స్ ఉంటారు. రమేశ్‌ కొండపై నుంచి పడిపోతుంటాడు. అయితే, రాధ కొండపై నుంచి చున్నీ విసిరి రమేష్‌ను రక్షిస్తుంది. సినిమాల్లో కనిపించే సీన్స్‌లో సదరు పాత్రలను కాపాడుతుంటారు. కొన్నిసార్లు రక్షించలేకపోతుంటారు. అయితే, బిగ్‌బాస్‌ 7 సీజన్‌లో మాత్రం ఇలా జరగదంటూ హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చారు. అంటే ఈ సీజన్‌లో సరికొత్తగా ఏదో ట్రై చేస్తున్నారనిపిస్తుంది.

ఫైనల్‌ లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా?

ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు కంటెస్టెంట్స్‌ విషయానికొస్తే.. నెట్టింట్లో ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో అమర్‌దీప్‌, శుభశ్రీ, ఐశ్వర్య, అనూష, షావలి, శోభా శెట్టి, విష్ణుప్రియ, అంజలి, మహేష్, షీతల్ గౌతమన్, ఆట సందీప్‌, యావర్, రష్మీ గౌతమ్‌, అనిల్, బుల్లెట్‌ భాస్కర్‌ పేర్లు సందడి చేస్తున్నాయి. వీరిలో ఎవరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇస్తారో మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.


Tags:    

Similar News