Bigg Boss 7 Telugu: ఈవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ ఆమె.. డేంజర్ జోన్‌లో ఇద్దరు..!

Bigg Boss 7 Telugu: ఈవారం ఎలిమినేషన్ అయ్యేది షకీలానే అని తెలుస్తోంది. ఏదైనా ఈరోజు షోలో తెలిసిపోనుంది.

Update: 2023-09-17 03:15 GMT

Bigg Boss 7 Telugu: ఈవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ ఆమె.. డేంజర్ జోన్‌లో ఇద్దరు..! 

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హౌస్‌లో రోజుకో మలుపు తిరుగుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వారిలో నిజాయితీగా కొందరు గేమ్ ప్లే చేస్తుంటే.. పక్కవాళ్లపై ఫిర్యాదులు చేస్తూ రచ్చ చేయాలని మరికొందరు నక్క జిత్తులతో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి ఎవరి గేమ్‌లో వాళ్లు మిగతా వారి కంటే ముందుండాలని చూస్తున్నారు.

ఇక వీకెండ్ ప్రోగ్రామ్‌లో జరిగే ఎలిమినేషన్ షోకు విపరీతమై డిమాండ్ ఉంటోంది. ఇప్పటికే తొలివారం కిరణ్‌ రాథోడ్‌ హౌస్ నుంచి తప్పుకుంది. ఇక అందరి చూపు రెండో వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటూ చర్చలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న రతిక, పల్లవి ప్రశాంత్‌, శివాజీ, తేజ, షకీలా, అమర్ దీప్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్‌ యావర్‌ నామినేషన్స్‌ ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో తెలుగు ఏమాత్రం రాని ప్రిన్స్‌ ఈవారం బిగ్ బాస్ హౌస్ నుంచి తప్పుకోవచ్చని అంటున్నారు. అయితే, హౌస్‌లో ఇచ్చే టాస్క్‌లతో తనను తాను నిరూపించుకున్నాడు. దీంతో ఎలిమినేట్‌ కాకపోవచ్చని మరికొందరు అంటున్నారు.

అయితే, షకీలా, తేజకు చాలా తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. ఈవారం ఎలిమినేషన్స్‌లో వీరిద్దరే ఉన్నట్లు మాట్లాడుతున్నారు. తేజ కొద్దో, గొప్పో నవ్వులు పూయిస్తున్నాడు. కానీ, శృంగార తారగా పేరుగాంచిన షకీలా పర్ఫామెన్స్‌ అంతగా లేదనేది వాస్తవం. అన్ని రకాలుగా చూసినా.. ఈవారం ఎలిమినేషన్ అయ్యేది షకీలానే అని తెలుస్తోంది. ఏదైనా ఈరోజు షోలో తెలిసిపోనుంది.

Tags:    

Similar News