Bigg Boss 7 Promo: ఇదేందయ్యా ఇది.. వామ్మో ఇన్ని డబుల్ మీనింగ్ డైలాగులా.. తిట్టిపోస్తోన్న జనాలు..!
Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ చప్పగానే నడుస్తోంది. ఎన్ని ట్రిక్కులు ఉపయోగించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది.
Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ చప్పగానే నడుస్తోంది. ఎన్ని ట్రిక్కులు ఉపయోగించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమవుతూనే ఉంది. 6వ సీజన్‌లా ఆకట్టుకోలేకపోతోంది. ఉల్టా-పుల్టా అంటూ 10 రోజుల క్రితం వైల్డ్ కార్ట్ ఎంట్రీతో ఐదుగురు కొత్తవాళ్లను తీసుకొచ్చారు. జనాలు వీళ్లను చూసి ఎవర్రా మీరంతా అనుకుంటూ.. షోను కట్టేస్తున్నారు. ఇంతమందిని తీసుకొచ్చినా పెద్దగా ఓరిగిందేమీ లేదు. కాగా, ఇప్పటి వరకు మాటల్లో కాస్త కంట్రోల్ తప్పకుండా ఉన్నా.. తాజా ఎపిసోడ్‌లో మాత్రం గీత దాటేశారు. ఫుల్‌గా డబుల్ మీనింగ్ డైలాగులతో దంచేశారు.
ఇంతకీ ఏమైందంటే?
ప్రస్తుతం ఏడోవారంలోకి అడుగుపెట్టిన బిగ్‌బాస్ 7 సీజన్‌లో భోలె, అశ్విని, తేజ, ప్రశాంత్, పూజా, అమరదీప్, గౌతమ్ ఇలా మొత్తం ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. సోమ,మంగవారాల్లో నామినేషన్ పూర్తయింది. నేటి నుంచి కెప్టెన్సీ టాస్క్ కూడా షురూ కానుంది. ఇందుకోసం ఓ ఫన్నీ టాస్క్ పెట్టారు బిగ్‌బాస్. ఈ క్రమంలో 2 పల్లెటూళ్లు థీమ్‌తో కొన్ని క్యారెక్టర్స్ వేయించారు. ఈ పాత్రల్లో జీవించిన శివాజీ, ప్రశాంత్‌ల నోటి నుంచి వచ్చిన మాటలు మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. శ్రుతిమించి పోవడంతో షోను చూసేందుకు ఇబ్బంది పడ్డారు.
ఆ డైలాగ్స్ ఏంటంటే?
పల్లెటూరి టాస్కులో భాగంగా ప్రశాంత్ మాట్లాడుతూ 'అన్నా తిప్పేద్దునా' అని అంటాడు. పక్కనే ఉన్న అశ్విని.. 'ఏంటిరా నువ్వు నన్ను తిప్పేది' అంటూ సమాధానమిస్తుంది. దీనికి ప్రశాంత్ 'నా చెంచా' అంటూ డబుల్ మీనింగ్ డైలాగు వదిలేస్తాడు. ఇక మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ అందుకుని'ఊరుని ఒక ఊపు ఊపుతున్నవటా కదా' అని అశ్వినిని అంటాడు. దానికి ఆమె 'ఇంత అందగత్తెని మరి ఆ మాత్రం ఊపనా ఏంటి?' అంటూ ఘాటుగానే సమాధానం ఇస్తుంది. దానికి శివాజీ కౌంటరిస్తూ 'నీ అందం ఏంటో చూద్దాం.. ఓసారి తోటకి రా' అంటాడు. ఈ క్రమంలో సందీప్.. 'ఓ పెద్దాయన నువ్వు చాలా లేతాకు' అంటూ ఘాటుగా చెబుతాడు. 'ఆకేదైనా ఆకే కదరా, మేం సున్నం రాస్తాం' అంటూ శివాజీ సమాధానమిస్తాడు. ఇలాంటి డైలాగులతో 'జబర్దస్త్' షోని మించిపోయారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.