Bigg Boss 7 Telugu: వైల్డ్ కార్డ్‌తో రీఎంట్రీ.. గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన రితికారోజ్.. శుభ శ్రీ ఔట్..
Rathika Rose: బిగ్‌బాస్ షోలో నేటి వరకు 6గురు అమ్మాయిలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్స్ అయిన నాటి నుంచి శనివారం వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.
Rathika Rose: బిగ్‌బాస్ షోలో నేటి వరకు 6గురు అమ్మాయిలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్స్ అయిన నాటి నుంచి శనివారం వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.కంటెస్టెంట్ల ప్రవర్తనతోపాటు ప్రేక్షకుల ఓట్లు కూడా వాళ్ల ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తుంటాయి. ఓటింగ్‌లో తక్కువ ఓట్లు వచ్చిన వారు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంటారు.
ఆరుగురిలో కిరణ్ రాథోడ్, దామిని భట్ల, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్, నయని పావని బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. కాగా, వీరిలో చివరి మూడు వారాల్లో హౌస్ నుంచి తప్పుకున్న వారిలో దామిని, రతిక, శుభశ్రీలలో ఓ లేడీని హౌస్‌లోకి రీ ఎంట్రీ చేసేందుకు బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు. అయితే, ఇందుకోసం ఓటింగ్ కూడా ఎనౌన్స్ చేశాడు. ఈ ఓటింగ్‌లో తక్కువ వచ్చిన వారిని మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతున్నట్లు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ ముగ్గురిలో శుభశ్రీ రీఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ లాస్ట్ మినిట్‌లో ఇచ్చిన ట్విస్ట్ కూడా అదిరిపోయింది. రతికా వైల్డ్ కార్డ్ తో రీఎంట్రీకి సిద్ధమైంది. ఈ ఆదివారంలోపే రతికా బిగ్ బాస్ ఇంట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో రతిక చేసిన మిస్టేక్స్‌ను సరిదిద్దుకుని, మరలా హౌస్‌లో కొనసాగేందుకు మంచి అవకాశం దక్కింది. మరి ఈ ఛాన్స్‌ను రతిక ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.