Bigg Boss 7: ఉల్టా-పుల్టా ట్విస్ట్ ఇదేనా.. ఆమెను అనుకోకుండానే ఎలిమినేట్ చేశారా.. గ్లామర్ డోస్‌కి చెక్ పడినట్లే?
Bigg Boss 7 Elimination: ఉల్టా-పుల్టా అంటూ మొదలైన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో తొలిసారి అనుకోనిది చోటు చేసుకుంది.
Bigg Boss 7 Elimination: ఉల్టా-పుల్టా అంటూ మొదలైన బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో తొలిసారి అనుకోనిది చోటు చేసుకుంది. ప్రతివారంలానే ఎలిమినేషన్ చేశారు. అయితే, ఒకరోజు ముందే హాట్ బ్యూటీని ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ సంకేతాలు ఇచ్చేశారు. దీంతో అసలైన ఉల్టా-పుల్టా మొదలైందా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గత సీజన్ కంటే దుమ్మురేపుతోందంటూ నానా ఆర్భాటం మొదలుపెట్టిన యాజమాన్యం.. అనుకున్నదానికంటే మజా అందించడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. డల్‌గా సాగుతోంది. సోమవారంతో పాటు వీకెండ్‌లో తప్పితే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కంటెస్టెంట్స్ ఘోరంగా విఫలమవుతున్నారు. ఇక హౌస్‌లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ మాత్రం గ్లామర్ డోస్ ప్రదర్శించడంలో ఎలాంటి మోహమాట పడడంలేదు. ముఖ్యంగా శోభాశెట్టి, రతిక కోసమే షో చూస్తున్న వాళ్లు కూడా ఉన్నారు.
ఇక ఈ వారం 6గురు కంటెస్టెంట్స్ ప్రియాంక, శుభశ్రీ, రతిక, తేజ, గౌతమ్, యవర్ ఎలిమినేషన్‌లో ఉన్నారు. వీరి నుంచి శుభశ్రీ, ప్రియాంక, యవర్, గౌతమ్ సేఫ్ జోన్‌లో ఉనట్లు తేలింది. ఇక డేంజర్ జోన్‌లో ఉన్న మరో ఇద్దరిలో రతిక హౌస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ, రతిక ఎలిమినేషన్ అయితే, షో చూస్ వాళ్ల సంగతి మరింత తగ్గినట్లేనని తెలుస్తోంది.