Bigg Boss 7 Elimination: బిగ్ ట్విస్ట్.. వచ్చి వారమైనా కాలే.. అప్పుడే నయని ఎలిమినేట్.. సంపాదన ఎంతో తెలుసా?
Nayani Pavani Remuneration: బిగ్‌బాస్ 7వ సీజన్ అనుకున్నట్లుగానే ఆరోవారం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఊహించని కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి పంపిచేశాడు.
Nayani Pavani Remuneration: బిగ్‌బాస్ 7వ సీజన్ అనుకున్నట్లుగానే ఆరోవారం బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఊహించని కంటెస్టెంట్‌ను హౌస్ నుంచి పంపిచేశాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంట్లోకి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని.. అప్పుడే ఎలిమినేట్ అయింది. వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, ఉన్న కొద్దిరోజుల్లోనే తను హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తోపాటు జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఈ వారంలోనే ఆమె ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
బిగ్‌బాస్‌లో ముఖ్యంగా ఈ ఉల్టా పుల్టా సీజన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియడం లేదు. ఇటు నామినేషన్స్ నుంచి అటు ఎలిమినేషన్స్ వరకు జనాలు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఆరోవారం 7గురు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, చివరి రెండు రోజుల్లో ఓటింగ్ మొత్తం మారిపోయింది. దీంతో శోభాశెట్టి, పూజామూర్తి, నయని పావని డేంజర్ జోన్‌లో పడిపోయారు. అంతకు ముందు టేస్టీ తేజ చివరి స్థానంలో ఉన్నాడు. కానీ, కెప్టెన్సీ టాస్క్‌లో ఆకట్టుకోవడంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది.
మొన్నటి దాకా శోభాశెట్టి, పూజామూర్తిలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌస్‌కు బైబై చెప్పనున్నారని భావించారు. కానీ, బిగ్ బాస్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. వచ్చి వారమైనా కానీ, నయని పావనిని ఎలిమినేట్ చేశాడు.
ఉన్నది వారమే అయినా.. ఏకంగా హౌస్ నుంచి వెళ్లేప్పుడు రూ.2 లక్షలు తీసుకెళ్లిందని అంటున్నారు. ఇంట్లోకి వచ్చేముందే ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంచితే, బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటికే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శుభశ్రీని రీఎంట్రీ పేరుతో తీసుకొచ్చాడు. ఆరోవారం ఒకరు ఎలిమినేట్ కాగా, మరొకరు రీఎంట్రీ ఇచ్చారన్నమాట. దటీజ్ ఉల్టా పుల్టా అంటున్నారు నెటిజన్స్.