Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. షాక్ ఇవ్వనున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఈ మేరకు తాజాగా విడుదలైన ఓ ప్రోమోలో నాగర్జున హింట్‌ ఇచ్చేశారు. దీనికి తోడు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో నలుగురు కంటెస్టెంట్స్ ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యారు.

Update: 2023-10-06 07:08 GMT

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. షాక్ ఇవ్వనున్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ఉండబోతున్నాయి. ఈ మేరకు తాజాగా విడుదలైన ఓ ప్రోమోలో నాగర్జున హింట్‌ ఇచ్చేశారు. దీనికి తోడు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో నలుగురు కంటెస్టెంట్స్ ఇప్పటికే ఎలిమినేట్‌ అయ్యారు. షకీలా, కిరణ్‌ రాథోడ్‌, రతికా రోజ్‌, దామని భట్ల బిగ్ బాస్ హౌజ్‌ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఇక రాబోయే వారాల్లోనూ ఎలిమినేషన్స్ ఉండబోతాయనే సంగతి తెలిసిందే. అయితే, ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్‌లో అంతా లేడీస్ హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ వారం జెంట్స్ లేదా లేడీస్ ఎవరు అవుతారోనని ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు.

అయితే, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం టేస్టీ తేజ హౌస్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఎంటర్‌టైన్మెంట్ తగ్గించకుండా ఉండేందుకు ఈ వారం వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మినీ లాంచ్‌ ఈవెంట్‌‌ను మేకర్స్‌ ప్లాన్ చేశారంట. ఈ ఆదివారం అంటే అక్టోబర్‌ 8న సాయంత్రం 7 గంటలకు ఈ ఈవెంట్ ప్రసారం కానున్నట్లు ప్రోమోలో నాగార్జున చెప్పుకొచ్చారు. కాగా, బిగ్‌బాస్‌ 2.0 లాంచ్‌ ఇదేనంటూ అంటున్నారు. ప్రోమోలో చెప్పినట్లుగా ‘ఈ సీజన్ లో ఇంకా ఎన్నో ఊహించనివి చోటు చేసుకుంటాయి. ఇది గుర్తుంచుకోండి. ఇది ఉల్టా పుల్డా సీజన్. ఆశ్చర్యానికి గురిచేసే, ఊహించని ట్విస్ట్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రోమోలో నాగార్జున హింట్ ఇచ్చారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్నది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. సోషల్ మీడియా సెలబ్రిటీ నయని పావని, మొగలి రేకులు ఫేమ్‌ అంజలి పవని, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ భోలే షామిలి, మరో సీరియల్‌ నటి పూజా మూర్తి కూడా బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రానున్నారని తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో అంజలి పవనిగ= గైర్హజారు కానున్నట్లు ప్రకటించారంట. ఈమె స్థానంలోనే జబర్థస్త్ కెవ్వు కార్తీక్‌ రానున్నడంట.

Tags:    

Similar News