Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ నుంచి గంగవ్వ బయటకు..?

Bigg Boss 4 Telugu : 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది.. ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ కాగా, ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు.

Update: 2020-10-10 13:32 GMT

Bigg Boss 4 Telugu : 16 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది.. ఇప్పటివరకు నలుగురు ఎలిమినేట్ కాగా, ముగ్గురు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఒక్కో వారం ఒక‌రు ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నారు. ఇందులో మొదటి ఎలిమినేషన్ లో సూర్యకిర‌ణ్ వెళ్ళగా, రెండోవారం క‌ళ్యాణి, మూడోవారం దేవి నాగ‌వ‌ల్లి, నాలుగో వారం స్వాతి దీక్షిత్ ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ళారు. అయితే ఐదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది..

అయితే తాజా సమాచారం ప్రకారం గంగవ్వ ఇంటి నుంచి వెళ్లనుందని తెలుస్తోంది. అయితే ఆమెకి అభిమానుల నుంచి మద్దతు ఉన్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె షోనుంచి వెళ్లిపోతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి గంగవ్వ నామినేషన్స్ లో గంగవ్వ లేదు. అయినా తప్పని పరిస్థితులలో ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా గంగవ్వను ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదీకాకుండా, హౌస్ లో టాస్క్ సందర్భంగా ఆమ‌ధ్య కూడా గంగవ్వ త‌న ఆరోగ్యం బాగోలేద‌ని, ఇంటికి వెళ్లిపోతాన‌ని బిగ్ బాస్ ను వేడుకుంది.. అయినప్పటికీ ఆమెను పంపించేందుకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ చూపించలేదు.. ఆమెకు వైద్యం చేయించి మ‌రికొన్ని రోజులు ఇంట్లోనే ఉంచేందుకు ప్రయ‌త్నించారు. అలా మరికొన్ని రోజులు బిగ్ బాస్ లో కొనసాగుతూ వచ్చింది గంగవ్వ.

అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా తానూ వెళ్తానని హౌస్‌లో ఉండ‌లేక‌పోతున్నాన‌ని మరోసారి గంగవ్వ వాపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె ఆవేదనని అర్ధం చేసుకొని ఆమెను పంపించేందుకు బిగ్ బాస్ సిద్దం అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్త గంగవ్వ అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. ఇన్నిరోజులు అందరితో కలిసి మెలిసి ఉండి అందరికి గట్టి పోటీని ఇచ్చింది గంగవ్వ.. ఆమెను షో విన్నర్ గా చూడాలని చాలా మంది అభిమానులు కూడా అనుకున్నారు. ఇక రేప‌టి నుంచి గంగవ్వ హౌస్ లో కనిపించదు అని అభిమానులు బాధ‌లో కూరుకుపోయారు. ఇక అటు ఓ ప్రముఖ టీవీ యాంకర్ కూడా ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.


Full View


Tags:    

Similar News