ఉత్కంఠగా సాగిన చివరి ఎలిమినేషన్.. విన్నింగ్ స్పీచ్ ఇచ్చిన కంటెస్టెంట్లు..
బిగ్ బాస్ సీజన్ 4 ఆఖరి వారంలోకి అడుగుపెడుతోంది. సోమవారం నుంచి ఫినాలే వీక్ మొదలవుతుంది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరో తెలిసిపోనుంది. ఇదిలా ఉంటే, ప్రతి ఆదివారం మాదిరిగానే ఈ సన్‌డేను కూడా నాగార్జున ఫన్‌డేగా మార్చారు. అయితే బిగ్‌బాస్ తెలుగు 4లో టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ఉండటంతో ఆదివారం ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగింది. సండే ఫన్‌డే కావడంతో వినోద కార్యక్రమాలు ఆడిస్తూ టాప్ 5 ఫైనలిస్టుల ఎంపికను చేపట్టారు. ఎలాంటి వినోద కార్యక్రమాలు కొనసాగాయి? 14వ వారంలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు? టాప్ 5 సభ్యులు ఎవరు? ఇప్పుడు చూద్దాం.
సండే ఫండే అంటూ వచ్చే నాగార్జున.. బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వులు పూయించారు. ప్రతీ ఒక్కరి చేత ఫన్ క్రియేట్ అయ్యేలా చేశాడు. ఇక బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ ఎంతో నాగ్ చెప్పేశాడు. చివరిగా టాప్ 5 లో చేరిన మూడో వ్యక్తిగా అభిజిత్ పేరును హోస్ట్ ప్రకటించారు.
బిగ్‌బాస్ ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ వేదికపైకి వచ్చిన నాగ్ తన ఇంటి సభ్యులను అడిగారు. టైటిల్ గెలవడానికి అని కొందరు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాలని కొందరు అంటూ తమ సమాధానాలు ఇస్తే దాంతో పాటు ప్రైజ్ మనీ కోసం అంటూ నాగ్ వెల్లడించారు. ప్రైజ్ ప్లీజ్ అంటూ అనగానే వేదికపైన 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉన్న బ్యానర్ కిందకు దిగింది.
ఇక 50 లక్షల ప్రైజ్ గెలిస్తే ఏం చేస్తారు అని నాగ్ అడిగితే ఇంటి సభ్యులు తమ ప్లానింగ్స్ వివరించారు. అనంతరం కంటెస్టెంట్లు విన్నింగ్ స్పీచ్ ఇచ్చారు. కాకపోతే వారి విజయం గురించి కాకుండా తోటి ఇంటి సభ్యుడు గెలిస్తే ఎలా స్పీచ్ ఇస్తారో చెప్పాలని నాగ్ మెలిక పెట్టారు. ఆ తర్వాత టాప్ 5 ఫైనలిస్టుల్లో మూడో కంటెస్టెంట్‌ను ఎంపిక చేసేందుకు హోస్ట్ నాగార్జున చేతిలో ఓ కవర్ తీసుకొని అందులో నుంచి ఫోటోను తీసి అభిజిత్ పేరు ప్రకటించారు. దాంతో ఈ సీజన్‌లో టాప్ 5 లో చేరిన మూడో వ్యక్తిగా అభిజిత్ పేరును హోస్ట్ ప్రకటించారు.
బిగ్ బాస్ రియాలిటీ షో పూర్తవడానికి మరో వారం మాత్రమే ఉంది. ఫైనల్ కి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ హౌస్ మేట్స్ లో టెన్షన్ పెరుగుతూ వస్తుంది. సండే ఫన్‌డే కావడంతో వినోద కార్యక్రమాలు ఆడిస్తూ టాప్ 5 ఫైనలిస్టుల ఎంపికను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నాలుగో కంటెస్టెంట్‌ను కూడా ప్రకటించారు. కొన్ని గేమ్స్ ఆడిస్తూ ఇంటి సభ్యులను జోష్‌లో నింపేసాడు. సినిమా పేరు కనుక్కోమని పోస్టర్ గేమ్ ఆడించారు. రెండో లెవల్‌లో డంబ్ షేరాడ్స్ ఆడించారు. ఈ గేమ్‌లో కూడా అమ్మాయిలు గెలుపు సాధించారు. నాలుగో కంటెస్టెంట్‌ను ప్రకటించే ముందు అభిజిత్‌ను ఎవరు 4 కంటెస్టెంట్ ఎవరు అవుతారని అడిగిన ప్రశ్నకు హారిక పేరు ఉంటుందని భావిస్తున్నాను అని చెప్పాడు. దాంతో ఒక బ్యానర్‌ను చేతిలో పెట్టి దానిని విప్పి చూడమని చెప్పగా అందులో హారిక ఫోటో కనిపించింది. దాంతో ఇంటి సభ్యుల్లో 5వ సభ్యుడి ఎంపిక మిగిలింది.
బిగ్ బాస్ లో చివరి ఎలిమినేషన్ జరిగింది. పదిహేను వారాల రియాలిటీ షో నుండి చివరి వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు హౌస్ లో ఐదుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. ఒక్కొక్కరుగా ఫైనల్ కి వెళుతూ, చివర్లో ఆరియానా, మోనాల్ ల మధ్య ఎలిమినేషన్ లో సస్పెన్షన్ కొనసాగింది. ఒక్కసారిగా ఆరియానా సేవ్ అవడంతో నోట మాటరాకుండా అయిపోయింది. మోనాల్ కన్నీళ్లతో అఖిల్‌కి పువ్విచ్చి వీడ్కోలు తీసుకుంది.
ఇక టాప్ 5లో నిలిచేందుకు మోనల్, అరియానా ఇద్దరు మిగలడంతో టెన్షన్ పెరిగింది. ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారనే ఆసక్తి పెరిగిపోయింది. అయితే తన నోటి నుంచి ఎలిమినేట్ అయ్యే వ్యక్తి పేరు చెప్పనని, బిగ్‌బాస్‌కు అవకాశం ఇస్తున్నని నాగ్ చెప్పాడు. ఆ తర్వాత ప్రింటర్ ఆన్ చేసి అందులో వచ్చిన ఫోటోను చూపించాడు. టాప్ 5 ఫైనలిస్టుగా అరియానా గ్లోరి ఎంపికైందని చెప్పాడు. దాంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది.
మోనాల్ ఎలిమినేషన్‌తో అఖిల్‌కు షాక్ తగిలింది. అతడి గొంతు మూగబోయింది. అతడి మౌన వేదనను అర్థం చేసుకున్న మోనాల్ కన్నీళ్లతో అతడికి పువ్విచ్చి వీడ్కోలు తీసుకుంది. స్టేజీ మీదకు వచ్చిన మోనాల్ తన జర్నీ చూసి ఇంటి సభ్యులతో మాట్లాడింది. టైటిల్ గెలవాలంటే ఏం మార్చుకోవాలో ఇంటిసభ్యులకు సలహాలిచ్చింది. అందరితో మాట్లాడమని, ముఖ్యంగా అఖిల్‌కు సమయం కేటాయించమని అభిజిత్‌కు సూచించింది. నేను హౌస్‌లో ఉంటే మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యేవారు అన్నావు కదా, ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వచ్చిందని అభికి చెప్పగా తానలా అనలేదని, బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. బిగ్‌బాస్ అయ్యాక తప్పకుండా గుజరాత్‌కు వచ్చి కలుస్తానని మాటిచ్చాడు. అరియానాకు టాస్క్‌లో అంత అగ్రెసివ్ వద్దని సూచించింది. సోహైల్ చిన్న చిన్న మాటలకు బాధపడొద్దని తెలిపింది. ఫైనల్‌లో హారిక అఖిల్‌ను దాటేయాలని కోరింది. ఆమె కోరిక విని అఖిల్ షాక్‌తో నోరు తెరిచాడు. చివరిగా నాగ్‌తో సెల్ఫీ దిగి మోనాల్ తన బిగ్‌బాస్ ప్రయాణాన్ని ముగించింది.
బిగ్ బాస్ టైటిల్ కోసం అఖిల్, అభిజీత్, సోహెల్, అరియానా, హారిక పోటీపడనున్నారు. అయితే బిగ్ బాస్ షో అంటేనే సర్‌ప్రైజస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే బిగ్ బాస్ మరొకటి చేస్తారు. అలాగే, విన్నర్ తారుమారు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.