సెంచరీ ఎపిసోడ్స్ దాటేసిన బిగ్‌బాస్ షో.. మంచి ఊపు తెచ్చిన బిగ్‌బాస్ జర్నీ ర్యాప్ సాంగ్..
ఎప్పుడూ సినిమా పాటలతో కంటెస్టెంట్లను నిద్రలేపే బిగ్‌బాస్ వంద ఎపిసోడ్‌లో కాస్త డిఫ్రెంట్‌గా ట్రై చేసి కావాల్సినంత కిక్ ఇచ్చాడు. బిగ్‌బాస్ జర్నీ ర్యాప్ సాంగ్ ప్లే చేసి, కంటెస్టెంట్లతో కేకలు పెట్టించాడు. ర్యాప్ సాంగ్‌లో ఇంటిసభ్యుల మాటలు, అరుపులు, ఏడుపులు డిఫ్రెంట్ వేరియేషన్‌ను చూపించాయి. రోటీన్‌గా కాకుండా వెరైటీగా వేకప్ సాంగ్ రావడంతో ఇంటిసభ్యుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. అది కూడా వారి మాటలే మ్యూజిక్‌తో మిక్స్ అయి ప్లే అవుతుండడంతో ఆశ్చర్యపోతూనే ఆగకుండా చిందులేశారు.
జర్నీ ర్యాప్ సాంగ్‌లో భాగంగా అరియానా అరుపులను ప్లే చేయడంతో హౌసంత గోలగోలగా మారింది. సోహైల్ అయితే పడి పడి నవ్వాడు. ఇక అరియానా బిత్తరపోయి చూడాల్సి వచ్చింది. డ్యాన్స్ ఎపిసోడ్ తర్వాత అఖిల్ విరహవేదన ఎపిసోడ్ నడిచింది. మోనాల్ ఎలిమినేట్ అవ్వడంతో అఖిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆమెను మిస్వవుతున్నానని తెగ ఫీలైపోయాడు. తానలో తాను మాట్లాడుకుంటూ తన ఫీలింగ్స్ ను బయటపెట్టేశాడు. అంతంటితే ఆగకుండా హారిక దగ్గరకు వెళ్లి బాధవుతుందే మస్తు బాధవుతుందే అంటూ వాపోయాడు. తాను లేకపోతే పిచ్చెక్కుతుందని చెప్పుకచ్చాడు. ఇక హారిక ఏదో అనబోతే టాపిక్ డైవర్ట్ చేశాడు అఖిల్.
మోనాల్ ఎలిమినేషన్‌తో ఫినాలే వీక్ మొదలైపోయింది. టాప్ -5లో నిలిచిన ఫైనలిస్టులల్లో బెస్ట్ ఎవరో తేల్చడానికి బిగ్‌బాస్ టాస్క్‌లు మొదలుపెట్టేశాడు. ముసుగు వెనుక దాగింది ఎవరూ అంటూ తొలి టాస్క్ ఇచ్చాడు. తనలో తాను దాచుకున్న అంశాన్ని ఎవరూ బయటకుతీశారు. ఏ సందర్భంలో జరిగిందో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ ఆదేశించాడు.
ఈ గేమ్‌కు ముందు కంటెస్టెంట్లకు క్రెజీ డ్రెస్సులు, మాస్కులు పంపించాడు బిగ్‌బాస్ వాటిని ధరించిన ఇంటి సభ్యులు బయటకు రాగానే మ్యూజిక్ ప్లే చేశాడు బిగ్‌బాస్. ఇక ఇంటిసభ్యులు కాళ్లు చేతులు ఆగుతాయా ఏదో వాళ్లకు తోచిన నాలుగు స్టెప్పులేసి పర్వాలేదనిపించారు. ముసుగు వెనుక దాగింది ఎవరూ అనే టాస్క్‌లో ఫస్ట్ అభిజిత్ తన అభిప్రాయాన్ని మిగితా ఇంటిసభ్యులతో పంచుకున్నాడు. నా కోపాన్ని ఇంట్లోకి జంటగా అడుగు పెట్టిన సోహైల్, అరియానా బయట పడేలా చేశారని చెప్పుకచ్చాడు.
అరియానాకు వంట సూపర్బ్‌గా వచ్చు కానీ వంటగదిలోకి వెళ్తే గొడవలు వస్తున్నాయని వంట రాదని తప్పించుకుందట కానీ అమ్మా రాజశేఖర్ వల్ల అందరికీ తెలిసిందని అరియానా వాపోయింది. తనలోని కోపం సోహైల్, అవినాష్ వల్ల బయట పడిందని తన ఓపినీయన్ షేర్ చేసుకుంది. దివి వల్ల తనలోని అగ్రెసివ్ బయటపడిందని సోహైల్ ప్రకటించాడు. ఇక అరియానా వల్ల తనకు వంట వచ్చనే విషయం బయటపడిందన్నాడు. అఖిల్ నోయల్ వల్ల బిగ్‌బాస్ హౌస్‌లో కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పాడు. అభి వల్ల తనకు కోపం కట్టలు తెచ్చుకుందని సోహైల్ క్లారిటీ ఇచ్చుకున్నాడు.
అభి వల్లే నాలో కోపం బయటపడిందని అఖిల్ అన్నాడు. తర్వాత హారిక మాట్లాడుతూ అరియానా వల్ల ఓపిక, అభి వల్ల పొజిషనెస్ బయటపడిందని చెప్పుకచ్చింది. మోనాల్, స్వాతి, అరియానాతో అభి మాట్లాడినప్పుడల్లా తనకు ఇబ్బందిగా అనిపించేదని తనలోనే ఫీలింగ్‌ను రివిల్ చేసింది హారిక. తర్వాత ఒక్కొక్కరి మాస్కులు విప్పుతూ వాళ్ల గురించి చెప్పుకచ్చారు కంటెస్టెంట్లు సోహైల్ ఎంత కోపగించుకుంటాడో అంతకంటే ఎక్కువ బాధపడతాడు. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం అని అరియానా కితాబిచ్చింది. తర్వాత సోహైల్ అరియానా గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న ప్రేమను బయటపెట్టదన్నాడు.
అభి గురించి నేను చెప్తానంటే నేను చెప్తానని అఖిల్, హారిక పోట్లాడారు. చివరికి అఖిల్ ఆ చాన్స్ కొట్టేసి, అభి కాస్త రిజర్వ్‌డ్‌గా కనిపిస్తాడు కానీ చాలా ఎమోషనలేనని అన్నాడు. తర్వాత హారిక అఖిల్ గురించి చెప్తూ అతడిని కేర్ తీసుకునేందుకు ఒకరు కావాలని ఎదురు చూస్తాడని మోనాల్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చింది. అభిజిత్.. హారిక మాస్క్ తీసేస్తూ ఆమె గురుంచి ప్రస్తావించాడు. హారిక లోపల ఉన్న విషయాన్ని బయట పెట్టదని చెప్పాడు. మోనాల్, అరియానాను బాగున్నారని మెచ్చుకుంటే నన్ను ఎందుకు పొగడలేదని దబాయించేదని చెప్పాడు.
చివరి వారం తొలిరోజే బిగ్‌బాస్ ఫైనలిస్ట్‌ల మధ్య చిచ్చు పెట్టేందుకు ట్రై చేశాడు. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ట్రోఫీ విజేతగా ఎందుకు అనర్హుడివి ఎవరూ అనర్హులు కారో డిసైడ్ చేయాలంటూ బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌తో మళ్లీ రచ్చమొదలవుతుందని బిగ్‌బాస్ ఎక్స్‌పెక్ట్ చేసినట్లు ఉన్నాడు. కానీ ఇంటిసభ్యులు ఈ టాస్క్‌ను పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశారు. కాకపోతే ట్రోఫీ అన్‌ఫిట్‌కు అమ్మాయిల పేర్లే ఎక్కువగా వినిపించాయి.
ఈ టాస్క్‌లో మొదట అభి తన ఓపినియన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పటివరకు 'ఎక్కువ సార్లు నామినేట్ అయి సేఫ్ అయ్యాను. తానే ట్రోఫీ గెలిచేందుకు అర్హుడిని చెప్పాడు. హారికతో పోటీపడటం నేను తట్టుకోలేను కాబట్టి ఆమె అర్హురాలు అని చెప్పుకచ్చాడు. టాస్కుల్లో హద్దులు దాటినందుకు అరియానా అనర్హురాలని అఖిల్ ఫిక్స్ అయ్యాడు. సోహైల్ అరియానా, అభిజిత్ అనర్హులు అని, హారిక అరియానా అనర్హురాలు అని చెప్పింది. మెజారిటీ ఫైనలిస్టులు అరియానా విజేత అయ్యేందుకు అర్హురాలు కాదని తేల్చి చెప్పారు.
చివరగా అరియానా కాస్త తెలివిగా మాట్లాడింది. 'ఆటలో తన పేరు గుర్తుండిపోవడం బాగుంది. అందరి బుర్రల్లోకి తన పేరే వచ్చిందంటే తానే గ్రేట్ గేమర్ అంటూ ప్రకటించుకుంది. అయితే కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హారిక విఫలమవుతుందని హారికను అనర్హురాలిగా డిసైడ్ చేసింది అరియానా. ఈ టాస్క్‌లో మొత్తానికి అరియానా, హారికకు ఎక్కువగా నెగెటివ్ ఓట్లు పడ్డాయి. ఈ టాస్క్ ముగిసిన తర్వాత హారిక, అరియానా టాస్క్ గురించి చర్చించుకున్నారు. అనర్హులుగా అమ్మాయిల పేర్లే రావడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ట్రోఫీ ఎలాగైనా అమ్మాయే గెలవాల్సిందేనని డిసైడ్ చేసుకున్నారు.