Bigg Boss 4 Telugu: కట్టప్ప ఎవరో తేలదు..బిగ్ బాస్ లో వినోదం ఎక్కడుందో కనబడలేదు!!

Bigg Boss 4 : కట్టప్ప ఉన్నాడని చెప్తాడు.. ఎవరో చెప్పండని ప్రతి ఎపిసోడ్ లోనూ అడుగుతాడు. అందరూ తమ అభిప్రాయలు చెప్పాకా రిజల్ట్ మాత్రం ఇవ్వడు. కట్టప్ప పేరుతో వినోదం గాలికి వదిలేశారు బిగ్ బాస్ టీం

Update: 2020-09-11 17:43 GMT

Bigg Boss 4 Telugu Episode 6 Highlights ( image courtesy : star maa promo video)

అందరూ కలిసి దిగ్విజయంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఓడిపోయారు. నీరసంగా సాగుతున్న బిగ్ బాస్ ఈరోజూ అలానే నడిచింది. మళ్ళీ గంగవ్వ వర్కౌట్ లు.. డైలాగ్ పంచ్ లె ఎపిసోడ్ ను నిలబెట్టాయి. కట్టప్ప గోల ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఇప్పుడప్పుడే పూర్తవదు అని బిగ్ బాస్ చెప్పేశాడు. ఇవీ ఎపిసోడ్ 6 హైలైట్స్..

కొంచెం వివరంగా చెప్పుకుంటే.. నిన్నటి ఆట టమోటా పల్ప్ తీయడం ఈరోజు కొనసాగింది. అందరూ పోటీ పడి ఆడారు కానీ.. ఎవరూ బిగ్ బాస్ ఇచ్చిన 30 బాటిళ్ళ టార్గెట్ రీచ్ కాలేదు. దాంతో లగ్జరీ బడ్జెట్ లో భారీకోత వేశాడు బిగ్ బాస్.14000 పాయింట్లకు కేవలం 2000 పాయింట్లు మాత్రమె ఇచ్చాడు.

గంగవ్వ నీకు సాటి ఎవరూ లేరు!

ఈ ఎపిసోడ్ లోనూ గంగవ్వ వర్కౌట్ లు హైలైట్. బంతితో ఇరవై సార్లు ఆడిన గంగవ్వ రన్నింగ్ కూడా చేసి అందరితో ఔరా అనిపించింది. ఇక తన మాటల గురించి చెప్పేదేముంది? గంగవ్వ అంటే గంగవ్వ అంతే!

ఇక కిచెన్ లో రాజశేఖర్ మాస్టర్ దివితో పులిహోర కలిపారు. దానికి సూర్యకిరణ్ సాక్షి. దివి చేతిని రాజశేఖర్ గిల్లాడు. దానికి ఆమె పనిమనిషి చూస్తోంది అంటూ మసాలా వేసింది. అంతే..అదే ఊపులో రాజశేఖర్ టీపొడి నూనెలో వేసేశాడు. దాంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మొత్తమ్మీద మళ్ళీ ఈరోజూ కట్టప్ప గోల పెట్టాడు బిగ్ బాస్. అందరినీ గార్దేన్ ఏరియాలో కూచో పెట్టి.. తాము ఎవరిని కట్టప్పగా భావిస్తున్నారో వారిపై కట్టప్ప అని రాసివున్న స్టాంప్ వేయాలి అని చెప్పాడు. అయితే, అందుకు కారణం కూడా చెప్పాలని ఫిటింగ్ పెట్టాడు. దీనిలో లాస్య కు నలుగురు కట్టప్ప అనుకుంటున్నట్టు స్టాంప్ వేశారు. నోయల్ కు కూడా ఆరుగురు కట్టప్ప స్టాంప్ వేశారు. దీంతో కొంచెం ఫీల్ అయ్యాడు నోయల్. నేనే కట్టప్ప అంటూ కొంత సీన్ క్రియేట్ చేశాడు. అంతా కలిసి స్టాంపులు వేసేసిన కొద్ది సేపటికి బిగ్ బాస్ మీలో కట్టప్ప ఎవరో ఇప్పుడు చెప్పబోవడం లేదు అని షాక్ ఇచ్చాడు. తరువాత మీకే తెలుస్తుంది అని తేల్చేశాడు. దీంతో అందరూ నిరాశలో మునిగిపోయారు.

అమ్మ రాజశేఖర్ కాస్త కామెడీ.. నోయల్ ర్యాప్ కొద్దిగా వినోదాన్నిచ్చాయి. అంతకు మించి ఈ ఎపిసోడ్ లో ఏమీ చెప్పుకునేందుకు లేదు. మరో సాదా సీదా ఎపిసోడ్ ఇది. రేపు శనివారం మరి నాగార్జున వస్తారు కాబట్టి ఆయనేమన్నా కట్టప్ప ఎవరో తెలుస్తారో లేకపోతె.. ఇంకొన్నాళ్ళు ఈ స్టోరీ తో బండిలాగిద్దామంటారో చూడాలి. ఇక ఈవారం ఎలిమినేషన్ కి ఏడుగురు సభ్యులు నామినేట్ అయివున్నారు. అభిజిత్, దివి, గంగవ్వ, మహబూబ్, సుజాత, సూర్యకిరణ్, అఖిల్ వీరిలో ఎవరు బయటకు వెళతారనేది రేపు తేలిపోనుంది.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోవచ్చని మీరు అనుకుంటున్నారు?

Full View


Tags:    

Similar News