Bigg Boss 4 Telugu: బాబోయ్ మరీ ఇంత లాగుడు వినోదమా..బిగ్ బాస్ ఏమైంది?
Bigg Boss 4 : కట్టప్ప ఎవరో తేలలేదు. అందరూ చర్చించారు. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన అరియానా..సోహైల్ గొడవ చేయలేకపోయారు. కానీ, హౌస్ లో గొడవలు లేపారు.
బిగ్ బాస్ హౌస్ లో ప్రతిరోజూ ఎదో ఒక ఏడుపు దుకాణం ఉండాలి.. ఉండి తీరుతుంది కదా. దానికి కారణాలు అక్కర్లేదు అలా వచ్చేస్తుంది అంతే. నిన్న సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా-సోహైల్ లను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి హౌస్ మేట్స్ తో గొడవ పెట్టుకోండి అని రెచ్చ గొట్టాడు కదా.. ఆయనేం చెప్పాడో వీళ్ళెం వినారో.. హౌస్ లోకి ఏం చేశారో తెలుసా? వాళ్ళు వీళ్ళ మీద గొడవ పడటం కాదు.. హాయిగా ఉన్న మిగిలిన పధ్నాలుగు మందిలో గొడవలు పెట్టారు. కనెక్టివిటీ నుంచి గ్రూప్ ల గోల మొదలైంది. చెప్పుకోవడానికి మూడో రోజు ఏమీ లేదు. ఉన్నంతలో కొన్ని విశేషాలు ఇవీ..
అసలేం జరిగిందంటే..
సోహైల్-అరియానా జంటగా హౌస్ లోకి అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చారు. వస్తూనే అందరినీ పలకరించినట్టే పలకరించి.. మాకు ఫుడ్ ఎందుకు పంపలేదు అని మొదలెట్టారు. నోయల్ తో సోహైల్ మా ఫోన్ ఎందుకు కట్ చేశావు అంటూ వేసుకున్నాడు. టాస్క్ లో అలానే ఉంటుంది అని నోయల్ దబాయించాడు. ఈలోపు అభిజిత్ మధ్యలో వచ్చి సోహైల్ ను ఎక్కువ మాట్లాడకు అంటూ గొడవ పడ్డాడు. తరువాత అంతా సర్దుకుని సోహైల్-అరియానా లను భోజనం చేయమన్నారు. సోహైల్ సైలెంట్ గా తన భోజనం చేస్తుంటే.. అరియానా మాత్రం తినకుండా గారాలు పోయింది. నాకు తినిపిస్తేనె తింటాను అంటూ ఓవర్ చేసింది. నీకు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినట్టున్నాడు అంటూ లైట్ తీసుకున్నాడు. ఈలోపు అఖిల్ వచ్చి అరియనాకు తినిపించాడు. దాంతో నోయల్ బామ్మకు భోజనం తినిపించావా అఖిల్.. అని అడిగాడు. దానికి అఖిల్ హార్ట్ అయిపోయాడు. నోయల్..మోనాల్ మాట్లాడుకుంటుంటే వెళ్లి ఎందుకు అలా అన్నావు నాకూ హ్యుమానిటీ ఉంది అంటూ చెప్పాడు. నోయల్ ఎదో చెప్పబోతున్నా వినకుండా వెళ్లి ఏడుపు అందుకున్నాడు. లాస్య అండ్ కో అతనిని ఊరుకో పెట్టడంలో బిజీ అయిపోయారు. ఇంతలో కల్యాణి ఒక్కటే బయట కూచుని ఉంటె దేవి వచ్చి పలకరించింది. నాకేం చెప్పక్కర్లేదు అని కల్యాణి దురుసుగా చెప్పడంతో దేవి కూడా అంతే దురుసుగా తలుపు వేసుకుని వెళ్ళిపోయింది. అంతే..ఇక కళ్యాణికి చాన్స్ దొరికింది. రాగాలు తీస్తూ లోపలి వెళ్ళింది. సూర్యకిరణ్ ఊరుకో పెట్టాడు. అయినా ఆమె వినలేదు. కొద్దిసేపు రాగాలు తీసింది. ఇలా అరియానా-సోహైల్ లను వాళ్ళతో గొడవ పదమంటే..వాళ్ళిద్దరూ మిగిలిన వాళ్ళ మధ్య గొడవలు పెట్టారు.
సుజాత, లాస్య, దివి, హారిక నలుగురు స్విమ్మింగ్ ఏరియాలో కూచుని కట్టప్ప ఎవరి ఉంటారు అనే విషయం కొద్దిసేపు చర్చించుకున్నారు.
గంగవ్వ హైలైట్స్..
ఉదయాన్నే పాటతో దినచర్య మొదలైంది. అందరూ డ్యాన్సు లతో హోరెత్తించారు. గంగావ్వ నాలుగు స్టెప్పులు వేసింది. తరువాత డంబెల్స్ తీసుకుని ఎక్సర్సైజ్ మొదలు పెట్టింది. ఈలోపు అభిజిత్, నోయల్ వచ్చి ఆమెకు సహాయం చేసి ఎలా ఎక్సర్ సైజ్ చేయాలో నేర్పించారు. తరువాత నోయల్ బామ్మా స్నానం చేసేస్తే పోతుంది అన్నాడు. దానికి గంగవ్వ ఏం కష్టపడిపోయావని ఇప్పుడు స్నానం చేయడం అంటూ కౌంటర్ వేసింది. తరువాత లయ, హారిక కొద్ది సేపు గంగవ్వను ఆట పట్టించే ప్రయత్నం చేశారు. లాస్య అవ్వా.. ఇప్పుడు బయట నుంచి ఇద్దరు వచ్చి హారికను ఎత్తుకుపోతే ఏం చేస్తాం అంది. పోనీ..బిగ్ బాస్ తీస్కరమ్మంటే పోతారు..అంది. దానికి లాస్య అవ్వా నువ్వు కట్టుకున్న చీర తప్ప మిగిలిన నీ చీరలన్నీ బిగ్ బాస్ ఇచ్చేయమంటే ఏం చేస్తావ్ అంది. అబ్బా నా చీరెలు ఏమిటికి ఇవ్వలే.. నె ఇవ్వ.. అంది. హారికను వదిలేస్తాం.. నీ చీరలు ఇమ్మంటే ఏం చేస్తావు అవ్వ అంటే పోనీ ఆ పిల్ల పొతే నాకేంటి.. నా చీరలు ఇవ్వ.. అంది.
మొత్తమ్మీద మూడోరోజు ఎపిసోడ్ చాలా సాదా సీదాగా గడిచిపోయింది. ఒక రకంగా బోర్ కొట్టించిందని చెప్పవచ్చు. రేపటి ఎపిసోడ్ లో ఎదో మంచి టాస్క్ ఇచ్చినట్టున్నాడు బిగ్ బాస్.. గంగావ్వ మాత్రం అందరికీ మాటల మరమరాలు పంచేస్తోంది.
బిగ్ బాస్ లో ఈవారం ఎవరు బయటకు వెళ్లిపోతారని మీరనుకుంటున్నారు..ఇక్కడ మీ అభిప్రాయం చెప్పండి.