Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ లో గంగవ్వ అంటే వణుకుతున్నారు.. బయటకు పంపడానికి ఆట మొదలెట్టేశారు!

Bigg Boss 4 : గంగవ్వను చూస్తె అందరికీ వణుకు పుడుతున్నట్టుంది. మొదటి రోజే నామినేట్ చేసేశారు.

Update: 2020-09-08 03:12 GMT

Gangavva (curtesy: Star Maa)

బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు అట్టహాసంగా ఆదివారం ప్రారంభమైంది. మొత్తం 16 మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపి లాక్ చేశారు నాగార్జున. మొదటిరోజు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందో ప్రసారం చేశారు.

అందరూ అనుకున్నట్టుగానే యూ ట్యూబ్ స్టార్ గంగవ్వ హౌస్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. మొదటి రోజు అంతా రచ్చ రాచ్చలా సాగింది. కల్యాణి లేని విషయానికి పెద్ద రాద్ధాంతం చేస్తే.. సుజాత అనవసర విషయానికి కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక మోనాల్ అక్కర్లేని ఎమోషన్ చూపిస్తే.. మహబూబ్ అమ్మా..నాన్నా గుర్తొచ్చి బావురుమన్నాడు. గంగావ్వతో అందరు ఇంటి సభ్యులు చక్కగా ప్రవర్తించారు. సుజాత ఎక్కువగా గంగావ్వ పక్కన ఉండడం కనిపించింది. ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న ఇద్దరూ ఆరియానా గ్లోరీ, సోహిల్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక మొదటి వారం ఎలిమినేషన్ ఉండదని అందరూ అనుకున్నారు కానీ, నామినేషన్ ప్రక్రియ మొదటి రోజే పూర్తి చేశాడు బిగ్ బాస్. మామూలుగానే ఇంటి సభ్యులు కొంత మందిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. 14 మంది సభ్యులను ఇద్దరేసిగా కనెక్ట్ చేసి వారిలో ఒక్కోరిని నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. అంటే 7 గురు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారన్న మాట.

నామినేషన్ ప్రక్రియలో అందరూ చాలా తెలివిగా ప్రవర్తించారు. కల్యాణి..సుజాత ల మధ్య మాత్రం గట్టి ఫైట్ అయింది. దాంతో కొద్దిసేపు రచ్చ అయింది.

ఇక సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉన్న గంగావ్వ విషయంలో హౌస్ మొత్తం అందరూ ఒక్కతాటి మీదకు వచ్చారు. (హారిక తప్ప) అంతా ముక్త కంఠంతో గంగావ్వను నామినేట్ చేశేశారు.గంగావ్వ ఇక్కడిదాకా రావడమే ఇంస్పిరిషన్ అని చెబుతూనే ఆమెను బయటకు పంపించేందుకు నామినేట్ చేసేశారు. అందరూ దానికి చెప్పిన కారణం ఒకటే..గంగావ్వా..నీకు బయట బోలెడు ఫాలోయింగ్ ఉంది. మేం నామినేట్ చేసినా ప్రజలు నిన్ను బయటకు వెళ్ళనీయరు అంటూ చెప్పుకొచ్చారు. మొత్తమ్మీద మొదటి వారమే పాపం గంగవ్వను ఎలిమినేషన్ జోన్ లోకి నెట్టేశారు అందరూ..

అంతకు ముందు గంగవ్వ హౌస్ లో మాటల మతాబులు వెలిగించింది. అభిజిత్..హారిక లు నామినేషన్ కోసం వెళ్ళినపుడు సుజాత..మంగవ్వకు ఎలా నామినేట్ చేయాలో వివరించింది. దానికి ఆమె పోరగాల్లు మస్తున్నారు. మొన్నే వచ్చారుగా..ఉండనీయ్ అని అంది. తరువాత లాస్య..మహబూబా లు వెళ్ళినపుడు అందరూ మేహబూబాను నామినేట్ చేస్తే.. చివరిలో గంగావ్వ మంది మాటే నామాట.. ఆళ్ళను కాదని పోగలనా..అంటూ మహబూబ్ ను నామినేట్ చేసింది మంగవ్వ.

మొత్తమ్మీద హౌస్ లో ఉన్నవారంతా మొదటిరోజే ఆట మొదలు పెట్టేశారు. రచ్చలు.. ఏడుపులు.. గ్లామర్ షో లు అన్నీ షురూ చేశేశారు. నామినేషన్ సందర్భంగా అందరూ ఎవరికీ వారు తమకు తగ్గట్టు ఆడారు. ముఖ్యంగా గంగవ్వ విషయంలో అందరూ భయపడుతున్నట్టు కనబడుతోంది. ఆమెను బయటకు పంపించాలి అనే విషయంలో దాదాపుగా అందరిదీ ఒకటే మాటగా అయింది. మొదటి రోజే ఇంత రచ్చ చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత రచ్చ చేస్తారో..

ఇక నెటిజన్లు మాత్రం గంగవ్వను నామినేట్ చేయడం పై అసంతృప్తి తో ఉన్నారు. 

Tags:    

Similar News