బిగ్ బాస్4 చివరి దశకు వచ్చేసరికి అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది. మిగిలిన ఏడుగురిలో ఎవరు విజేత అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఫినాలే మొదలు కావడంతో రచ్చ కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు డబుల్ అయిపోయింది. అసలే ఫైనల్ కదా అందుకే ఆ టెంపో కూడా ఇప్పుడు కంటెస్టెంట్స్‌లో కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకూడదని గట్టిగానే గేమ్ ఆడుతున్నారు. ఫిజికల్ టాస్కులు అంటే దూరంగా ఉండే అభిజీత్ కూడా ఇప్పుడు దూకుడు చూపిస్తున్నాడు. ఇక సోహైల్, అఖిల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక అవినాష్ మాత్రం అవపరిచితుడు పూనినట్లు వ్యవహరిస్తున్నాడు. కన్ఫ్యూజ్ అయినా మోనాల్ క్లారిటీ కోసం బిగ్ బాస్‌కి రిక్వేస్ట్ పెట్టుకుంది. మరోవైపు అరియానా, అవినాష్ రేగిన మాటల మంటలు అవినాష్ ఓదార్పుతో చల్లారాయి. ఇంతకి ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ షోలో అవినాష్ ఒక్కోసారి అపరిచితుడిలా మారిపోతుంటాడు. టాస్కుల్లో ఒక్కసారిగా అంత ఎత్తున లేస్తాడు. అప్పటి వరకు నవ్వుతూ కనిపించిన అవినాష్ ఎందుకు ఎవరి మీద అరుస్తున్నాడో తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు. ఈ ఎపిసోడ్‌లో కూడా అవినాష్ మాటలకు రచ్చ రేగింది. ఇక సోహైల్ వార్నింగ్‌తో కన్ఫ్యూజ్ అయినా మోనాల్ అవినాష్‌కు క్షమించిమని కోరుతూ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది.
ఎప్పటిలాగానే హుషారైన పాటకి స్టెప్పులు వేస్తూ ఇంటి సభ్యులు మంచి జోష్‌లో కనిపించారు. ఇక మోనాల్ నన్ను తన్నింది? అంటూ గత ఎపిసోడ్ రచ్చను అవినాష్ మళ్లీ షురూ చేశాడు. ఆమె దగ్గరకు పోతేనే ఏదో ఔతుందని అభిజిత్ మాట కలిపాడు. ఆ తరువాత సొహైల్-అఖిల్‌లు విడివిడిగా గేమ్ ఆడితే బాగుండేదని ఇద్దరూ కలిసి ఎలా ఆడుతారని అవినాష్ ప్రశ్నించడంతో రచ్చ రేగింది. సొహైల్, అవినాష్ వాదించారు. ఇక అవినాష్‌ని మోనాల్ తన్నింది నిజమే అయితే ఆమెతో ఇక మాట్లాడనని సొహైల్ అన్నాడు. దీంతో ఆమె గురించి చెప్పడం ఎందుకులే వదిలెయ్ అని అభి అన్నాడు.
కిచెన్‌లో ఉన్న మోనాల్ దగ్గరకు వెళ్లిన సొహైల్ నువ్ అభిజిత్‌ని తన్నిన వీడియో కానీ చూపిస్తే మాత్రం నిన్ను గట్టిగా కొడతా అని వార్నింగ్ ఇచ్చాడు. నేను తప్పు చేయలేదు ఎందుకు కొడతావ్ నేను బాటిల్‌నే తన్నా కాన్ఫిడెన్స్‌తో చెప్తున్నా అని చెప్పింది మోనాల్. అయితే సొహైల్ పక్కకు వెళ్లిన తరువాత 'నేను కన్ఫ్యూజ్‌లో ఉన్నా.. ఈ ఇష్యూలో డిస్కషన్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లింది నన్ను కన్ఫషన్ రూంకి పిలిచి క్లారిటీ ఇవ్వండి బిగ్ బాస్' అని కోరింది. ఇక అవినాష్ దగ్గరకు వెళ్లి నన్ను క్షమించు నేను కావాలని తన్నలేదు నువ్ అంత హర్ట్ అవుతావ్ అని అనుకోలేదు. ఏమైందో నాకు తెలియలేదు అంటూ అవినాష్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసింది మోనాల్. ఆ తర్వాత అవినాష్‌కి కొసరి కొసరి ముద్దులు పెడుతూ కౌగిలితో ఉక్కిరిబిక్కిరి చేసింది.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో జరుగుతున్న రోడ్ టూ ఫినాలే టాస్క్‌లో ఇంటి సభ్యులు మధ్య కోపాలు తాపాలు కనిపించాయి. టాస్క్ రూల్స్ చెప్పి ఆట మొదలు పెట్టడంతో పోటీ దారులు ఎవరికి వారు సత్తా చాటడానికి తీవ్రంగా కృషి చేశారు. అయితే గేమ్‌లో భాగంగా సోహైల్, హరిక మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరిగా టాస్క్‌లో గెలిచి నెక్ట్స్ లెవల్‌కి ఆ ఇద్దరు స్నేహితులు అర్హత సాధించారు.
ఫినాలే రేసులో రెండో లెవల్ ప్రారంభమైంది. ఇందులో పై నుంచి పడే పూలను సేకరించి మట్టిలో నాటాలి. ఎక్కువ పూలు నాటిన ఇద్దరు తర్వాతి లెవల్‌కు అర్హత సాధిస్తారు. ఈ పూలు పట్టుడు టాస్క్‌లో అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక పోరాడారు. పూలను సేకరించిన అఖిల్, సోహెల్ తమ బనియన్‌లో దాచుకోవడంపై బిగ్‌బాస్ చివాట్లు పెట్టారు. ఇది వ్యక్తిగతమైన గేమ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సేకరించిన పూలను పూలతొట్టిలో నాటాలని సూచించారు. దాంతో వారిద్దరూ తమ బనియన్స్‌లో నుంచి పూల మొక్కలను తీసి మట్టిలో నాటారు.
ఇక బిగ్ బాస్‌పై అరినాయా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరిగిందని ఏడ్చింది. గత ఎపిసోడ్‌లో ఇద్దరు కలిసి ఆడినప్పుడు బిగ్‌బాస్ వ్యక్తిగత ఆట అని హెచ్చరించలేదు కానీ ఈ రౌండ్‌లో మాత్రం ఎందుకు హెచ్చరించాడని అరియానా బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చింది. దాంతో అరియానాను అవినాష్ ఓదార్చాడు. ఇక పువ్వులు సేకరించే సమయంలో సోహైల్‌కు, హరికకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు గొంతు పెంచి ఆరుచుకున్నారు. ఒకరికి మరో సవాల్ విసురుకొని గేమ్ ఆడారు. ఈ లెవల్‌లో హారిక, అభిజిత్ ఓడిపోగా ఇద్దరు స్నేహితులు అఖిల్, సోహైల్ తర్వాతి ఘట్టంలోకి అడుగు పెట్టారు.
వంట గదిలో మాటల మంటలు రేగాయి. కిచన్ రూంలో ఉన్న మసాలాల ఘాటు అరియానా మాటల్లో రేగింది. అవినాష్ మాటలకు చిర్రెత్తిపోయిన అరియానా నేనేం మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా? అని నిలదీసింది. తన బాడీలాంగ్వేజ్‌ను కామెంట్ చేస్తూ మాట్లాడినందుకు అరియానా హర్ట్ అయింది. ఇంటి పనులు చేయాల్సిన విషయంలో అవినాష్, అరియానా గొడవ పడ్డారు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదని నన్ను ఎందుకు అన్నావు? అని అవినాష్ ప్రశ్నించడంతో ఆమె సారీ, క్షమించు అంటూ దండం పెట్టేసింది. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. కాసేపటికి ఒంటరిగా బాధపడుతున్న అరియానాను అవినాష్ బుజ్జగించాడు. నువ్వు అలా మాట్లాడకూడదు అని చెప్పడానికే వచ్చాననడంతో ఇక నుంచి నా మాటలు కంట్రోల్ చేసుకుంటానని అరియానా చెప్పింది. దీంతో అరియానను హత్తుకుని ఓదార్చాడు.
బిగ్ బాస్ సీజన్ 4 మరో మూడు వారాల్లో ముగుస్తున్న తరుణంలో విజేత ఎవరన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది. ప్రస్తుతం ఫినాలే రేస్‌లో టాప్ 7 కంటెస్టెంట్స్ నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. పసలేని టాస్క్‌లో ఎవరు గెలిచి మెడల్ సాధించి డైరెక్ట్‌గా ఫైనల్‌కి వెళ్తారనేది ఆసక్తిగా మారింది.