Bigg Boss 4 Telugu: నామినేషన్ లో ఆరుగురు.. మోనాల్ మళ్ళీ!
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ ఎడో వారం నామినేషన్ లో ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆ ఎపిసోడ్ హైలైట్స్
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఎడో వారంలోకి అడుగుపెట్టింది. వినోదాలు.. వివాదాలు.. టాస్క్ లు.. ఫైట్లు.. నామినేషన్లు.. నిష్క్రమణలు.. ఇలా అన్ని కోణాల్లోనూ సందడి చేస్తూ ముందుకు సాగుతోంది బిగ్ బాస్. మండే వచ్చిందంటే చాలు బిగ్ బాస్ లో మంటలు మండుతాయి. అప్పటివరకూ కౌగలించుకుని కబుర్లు చెప్పుకున్న వారు కొట్లాటలు కుంపటి పెట్టేస్తారు. కాదు.. పెట్టేలా బిగ్ బాస్ చేస్తాడు. ఈ వారమూ అదే జరిగింది.. ఎడో వారం నామినేషన్ ప్రక్రియ నేరుగా స్నేహితుల మధ్య మంట పెట్టింది. మరి ఈ వారం ఎవరెవరు ఎలా నామినేషన్ లోకి వచ్చారో చూద్దాం..
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. వారిలో అమ్మ రాజశేఖర్ నామినేషన్ నుంచి సేఫ్ జోన్ లో ఉన్నాడు. నోయల్ పోయిన వారం కెప్తెన్సీ టాస్క్ సందర్భంగా సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు. వీరిద్దరినీ మినహాయిస్తే..మిగిలిన పది మందిని ఇద్దరు ఇద్దరుగా విదగొట్టాడు బిగ్ బాస్. ఈ ఇద్దరిలో ఒకరు నామినేట్ కావాలి. ఎవరు నామినేట్ కావాలనేది వారిద్దరే తేల్చుకోవాలి. ఎందుకు నామినేట్ కావాలో. ఎందుకు కాకూడదో ఇద్దరూ కారణాలు చెప్పుకుని డిబేట్ చేయాలి. చివరికి ఎవరో ఒకరు కచ్చితంగా నామినేట్ కావాలి. నామినేట్ అవుతున్న వారిపై రెండో వ్యక్తీ రంగు నీళ్ళు పోయాలి . ఇదీ ఈవారం నామినేషన్ ప్రక్రియ.
అయిష్టంగా అవినాష్..
అవినాష్-సోహెల్ ఇద్దరి మధ్య నామినేషన్ కోసం వార్ జరిగింది. ఇద్దరి మధ్య గట్టి వాదన జరిగింది. నువ్వు ఇప్పటివరకూ నామినేట్ కాలేదు కాబట్టి ఈసారి కావాలని సోహెల్ అవినాష్ ను అన్నాడు. దానికి అవినాష్ ఒప్పుకోలేదు. దీంతో కెప్తెన్సీ టాస్క్ సందర్భంగా తనపై నోరు పారేసుకున్న విధానాన్ని సోహెల్ అవినాష్ కు గుర్తుచేసి దాని కోసం నామినేట్ కావాలని చెప్పాడు. దానికి అవినాష్ అంగీకరించలేదు. మొత్తమ్మీద అవినాష్ అయిష్టంగానే నామినేట్ కావడానికి ఒప్పుకున్నాడు. తరువాత ''బిగ్ బాస్ చిన్న చిన్న కారణాలకు నామినేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. మేం ఎలాంటి పరిస్థితితుల్లో ఇక్కడికి వచ్చామో మీకు తెలుసు. కొన్ని వదులుకుని మేం ఇక్కడికి వచ్చాం.. బయటకు వెళ్తే మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. వ్యక్తిగత కారణాలతో నామినేట్ చేసుకోవాలని అంటున్నారు.. జరిగిపోయిన వాటిని మళ్లీ కారణాలుగా చెప్పి నామినేట్ చేసుకోమనడం కరెక్ట్ కాదు.. సేఫ్ గేమ్ ఆడుతున్నా అన్నారు.. అరిస్తే రీజన్ తీసుకుని నామినేషన్ కావాలంటున్నారు.. ఏమౌతుందో తెలియడం లేదు'' అంటూ బిగ్ బాస్ కు తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
హారిక కోసం అభిజీత్..
హారిక.. అభిజీత్ ల మధ్య ఆసక్తికరంగా వాదన నడిచింది. నేను ఇప్పటివరకూ ఆరుసార్లు నామినేట్ అయ్యాను.. ఇన్నిసార్లు నన్ను సేవ్ చేశారు ప్రేక్షకులు.. మళ్ళీ నామినేట్ అయితే సేవ్ చేస్తారని అనుకోను అంటూ అభిజీత్ హారికను నామినేట్ కావాలని అన్నాడు. దానికి హారిక ఒప్పుకోలేదు. నేనూ ఐదు సార్లు నామినేట్ అయ్యాను.. అంది. వాదనలో అభిజీత్ నామినేట్ అవడానికి ఒప్పుకున్నాడు. చివరికి బిగ్ బాస్ ను ఇది అన్ ఫెయిర్ అంటూ చెప్పింది హారిక. తాను అభిజిత్ ను నామినేట్ చేస్తున్నానని రంగునీళ్ళు చల్లింది.
లాస్య నా పై తన అభిప్రాయాన్ని మార్చుకోవాలి..
నాలుగుసార్లు నామినేట్ అయ్యాను.. ఒక్కసారి తప్పించుకుని ఓట్లు వేసే వారికి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ లాస్య దివిని నామినేట్ కావాలని కోరింది. దానికి దివి అంగీకరించి.. కేవలం నా మీద నీకున్న అభిప్రాయం మారాలనే నేను నామినేషన్ లోకి వెళుతున్నా అని చెప్పింది.
అరియానా అదుర్స్..
అరియానా-మెహబూబ్ ల మధ్య నామినేషన్ కోసం నువ్వా..నేనా అనే వాదన ఒక రేంజిలో సాగింది. చివరకు అరియానా మెహబూబ్ కోసం త్యాగం చేస్తున్నాను అంటూ నామినేట్ అయింది. అరియానా అలా వెనక్కి తగ్గిన విధానంతో హౌస్ మేట్స్ అందరూ ఫిదా అయిపోయారు. సోహెల్ అరియానాను పొగడ్తలతో ముంచేశాడు.
అఖిల్ ను రక్షించడానికి మోనాల్..
అఖిల్ చాలా స్ట్రాంగ్ కాబట్టి తను హౌస్ లో ఉండాలని మోనాల్ చెప్పింది.. అఖిల్ చెప్పిన మాటలకు కన్విన్స్ అయిన మోనాల్ తాను నామినేట్ అవడానికి ఒప్పుకుంది.
ఇలా నామినేషన్ ప్రక్రియ ముగిసింది. నామినేషన్ లో చివరికి నోయల్, మోనాల్, అభిజీత్, దివి, అరియానా, అవినాష్ మిగిలారు. మరి ఈవారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.
ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి
ఇది అధికారిక పోల్ కాదు. మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం మాత్రమే. మరిన్ని బిగ్ బాస్ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.