Bigg Boss 4 Telugu: నా వ్యక్తిత్వం ప్రేక్షకులకు తెలిసింది..కుమార్ సాయి!
Bigg Boss 4 Telugu: ఉన్నది కొద్ది వారాలే అయినా సరే.. ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు కుమార్ సాయి. బిగ్ బాస్ ఆరోవారం హౌస్ నుంచి బయటకు వచ్చిన కుమార్ సాయి హెచ్ఎంటీవీ తో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు మీకోసం..
''నేను వచ్చినందుకు సంతోషంగా లేను. ఎలిమినేట్ అయినట్టు నాకు తెలీదు. ఎలిమినేటేడ్ అన్నపుడు నాకు బాధ అనిపించలేదు. ప్రేక్షకులు ఓట్లు వేసి గెలిపిస్తారు. నాకు ఒకవేళ ఓట్లు పడలేదేమో.. ప్రేక్షకులు ఇంతవరకూ ఆదరించారు అని అనుకుని సంతృప్తి చెందాను. కానీ, బయటకు వచ్చాకా అసలు బాధ మొదలైంది. ఎందుకంటే, బయటకు వచ్చాకా అందరూ మేం నీకే ఒటేశాం భయ్యా. అంటుంటే అరె ఇలా జరిగిందేమిటి అని బాధ పడుతున్నాను.'' అంటూ చెప్పారు నటుడు కుమార్ సాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన నటుడు కుమార్ సాయి.. ఆరో ఎలిమినేషన్ గా హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ ఎలిమినేషన్ విషయంలో అభిమానులలో ఎన్నో అనుమానాలున్నాయి. అయినప్పటికీ, ఎలిమినేషన్ అంటే బయటకు రావడమే కదా. కుమార్ సాయి అలానె బయటకు వచ్చేశారు. ఆయన హౌస్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచీ అప్పటికే ఫ్రెండ్స్..గ్రూప్స్ గా తయారైపోయిన మిగిలిన కంటెస్టెంట్స్ ఆయనను బయటకు పంపించేయాలనే చూశారు. కానీ, తన ఆట తీరుతో.. తిరుగులేని వ్యక్తిత్వంతో బిగ్ బాస్ లో ఒక సారి కెప్టెన్ గా కూడా ఎంపికయ్యారు కుమార్ సాయి. ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన కుమార్ సాయి ఆదివారం ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఆయన ప్రత్యేకంగా హెచ్ఎంటీవీ స్టూడియోలో సోమవారం మధ్యాహ్నం తన బిగ్ బాస్ అనుభవాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా అయన పై వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఎం చెప్పారంటే..
- నాగార్జున గారు నేను బిగ్ బాస్ లోకి వెళ్ళిన వెంటనే నన్ను అడిగిన మొదటి ప్రశ్న ఒక వారం తరువాత హౌస్ లోకి వెళుతున్నారు. నీకు అది ఎడ్వాంటేజ్ అవుతుంది కదా అన్నారు. దానికి నేను అదే నాకు డిస్ఎడ్వాన్టేజ్ అవుతుందేమో సార్ అన్నాను. అదే జరిగింది.
- మనుషుల్లో అలా జరుగుతుందని అనుకోం.. అలాగని వాళ్ళు కలుపుకోలేకపోయారానీ అనుకోలేం. నేను వెళ్ళేటప్పటికే హౌస్ లో అందరూ వాళ్ళల్లో వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవడం వంటివి జరిగిపోయాయి. దాంతో వారి మధ్యలో నన్ను వాళ్ళు ఎక్సేప్ట్ చేయలేకపోయారనిపిస్తుంది.
- నేను మొదటి వారం డల్ గా ఏమీ లేను. నా వ్యక్తిత్వమే అటువంటిది. ఫోర్స్ బుల్ గా ఎదుటి వ్యక్తితో కలిసిపోవాలని ఉండదు. ఒక వ్యక్తితో కలవాలంటే అవతల వైపు నుంచి కూడా మనవైపు ఆ వైబ్రేషన్ ఉన్నపుడే వాళ్ళతో కలవగలుగుతాం అని నమ్ముతాను. అలా అని నేను ఇలా ఉండిపోలేదు. నేనూ ప్రయత్నించాను. కానీ, ఎందుకో అది వర్కౌట్ కాలేదు అంతే.
- బిగ్ బాస్ లో చాలా కష్టమైన పరిస్థితి ఏమిటంటే.. నామినేషన్ చేయడం. అది చాలా కష్టం. అయితే, హౌస్ లో అందరికీ నామినేషన్ చేయడానికి నేను దొరికాను. ఎందుకంటే, వాళ్ళంతా అప్పటికే ఫ్రెండ్స్ లా కలిసిపోయారు. సో..నన్ను నామినేట్ చేయడానికి వాళ్లకి ఏ రకమైన ఇబ్బంది లేదు. అందుకే నన్ను నామినేట్ చేసి తప్పించుకునే వారు. ఈ విషయం హౌస్ లో ఓ వ్యక్తి నాతో అన్నాడు కూడా.. ఏమీ అనుకోకు బ్రో తప్పక నిన్ను నామినేట్ చేస్తున్నాం అని అన్నాడు. అలా నన్ను రిక్వెస్ట్ చేసి కూడా నన్ను నామినేట్ చేశారు.
- నేను చాలా హుషారుగా వెళ్ళాను బిగ్ బాస్ హౌస్ లోకి. కానీ, నాకు ఏమీ అనుకూలించలేదు. అయినా, నేను నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశాను.
- ఒక ఆర్టిస్ట్ గా నేను నాకు ఏదైనా స్కిట్ ఇస్తే నేను కామెడీ చేస్తాను. అంతే కానీ, రోజూ అదేపనిగా కామెడీ చేస్తూ గడపలేను. ఇప్పుడు డాన్స్ చేయాలి.. యాక్ట్ చేయాలి ఇలా ఏదైనా టాస్క్ వచ్చినపుడు నేను అందులో ఇమిదిపోతాను. కానీ, అక్కడ అందరూ ఏమనే వారంటే.. నీ క్యారెక్టర్ చూపించు. నీ టాలెంట్ అంతా ప్రదర్శిస్తూ ఉండు ఇలా చెప్పేవారు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే.. నన్ను నామినేట్ చేసేటపుడు నువ్వు చాలా టాలెంటెడ్ అందుకే నామినేట్ చేస్తున్నాం. నీ టాలెంట్ బయటకు తీయి అని అనేవారు. నాకు స్పేస్ ఉన్నపుడు చేస్తాను కానీ, నేను కమెడియన్ కాబట్టి ఇరవై నాలుగు గంటలూ కామెడీ చేయను.
- నేను బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వేల్లానంటే నా వ్యక్తిత్వానికి కప్పు రావాలని వెళ్ళాను. అంతే కానీ, నాలోని నటుడికి కప్పు తెచ్చుకోవడం కోసం కాదు.
- నా నటనకు ప్రేక్షకులు ఎప్పుడో కప్పు ఇచ్చేశారు. నాకు నేనుగా.. వ్యక్తిగా నేను ఏమిటో చూపించడానికి బిగ్ బాస్ ఒక అవకాశం అనుకున్నాను. అది నెరవేరింది. నా వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలిసింది.
- చాల చోట్ల స్కిట్ లు జరుగుతాయి.. అది బిగ్ బాస్ కాదు.. చాలా ఈవెంట్ లు జరుగుతాయి అవి బిగ్ బాస్ కాదు. బిగ్ బాస్ లో ప్రేక్షకులు ఏమి అనుకుంటారంటే.. మేము హౌస్ లో ఎలా ప్రవర్తిస్తున్నాం.. ఎలా టాస్క్ లు చేస్తున్నాం.. తోటి వారితో ఎలా ఉంటున్నాం వంటి అంశాలు చూస్తారు. నేను వాటిని చూపించడం కోసం బిగ్ బాస్ కు వెళ్ళాను.
- నాకు బిగ్ బాస్ లోకి వెళ్లేముందు ఏం చెప్పారంటే.. హౌస్ లో బిగ్ బాస్ ఏది చెబితే అది చేయాలన్నారు. బిగ్ బాస్ సూచనల మేరకు .. మీలా మీరు ఉంటూనే టాస్క్ లు చేయాల్సి ఉంటుందన్నారు. అదే నాకు తెలుసు తప్పితే బిగ్ బాస్ ఏం ఆలోచిస్తున్నారనేది నాకేమీ తెలీదు.
- నేను హౌస్ లో ఉన్నపుడు బయట ఏం జరిగిందో తెలీదు కానీ..బయటకు వచ్చాకా నువ్వు ఇంకా ఉండాల్సింది సోదరా అని అందరూ అంటుంటే.. నేను నటుడిగా బస్టాప్, ఈరోజుల్లో సినిమాలు చేసినపుడు నా యాక్టింగ్ అందరూ మెచ్చుకున్నారు. బిగ్ బాస్ లో నా వ్యక్తిత్వాన్ని మెచ్చుకోవాలి అనుకున్న నా కోరిక తీరింది అనిపించింది. ఇప్పుడు నేను వ్యక్తిగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోగాలిగాను.
ఇక కుమార్ సాయి ఉన్న కొన్ని రోజులూ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగాలిగారని చెప్పవచ్చు. కుమార్ సాయి తన టాలెంట్ తో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయారు.