బిగ్ బాస్ లో అలీ రెజా .. నష్టపోయాడు ఇలా !

Update: 2019-09-10 13:20 GMT

బిగ్ బాస్ రంగుల కల ... ఒక ఇంట్లో కొంతమంది వ్యక్తులు కొన్ని రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎలా జీవించగలరు అనే కాన్సెప్ట్ .. ఇది ఒక ఆట. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత ఆట ఆడుతూ పోవడమే తప్ప బాహ్య ప్రపంచంలో ఎం జరుగుతున్నది అనేది తెలిసే అవకాశం ఉండదు . చూసే వారికీ అది వినోదం. అయితే పేరు కోసమో, డబ్బు కోసమో, త్రిల్ కోసమో దానిలో భాగమైన వారు బయటకు వచ్చిన తర్వాత తమ ఆత్మీయులను కోల్పోయమన్న నిజం తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ విషాదం ఎంత కృంగదిస్తుంది? సరిగ్గా ఇదే అనుభవం అలీ రెజాకి ఎదురైంది .

ఏడూ వారలు పాటు బిగ్ బాస్ లో చక్కని ఆట ఆడి వేలాది అభిమానుల మనసు గెలుచుకున్నా అలీ రెజా ఆదివారం ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చాడు . బయటకు వచ్చినా ఆయనకి షాకింగ్ నిజం తెలిసింది. తానూ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న సమయంలో తన మామయ్య చనిపోయాడన్నదే అ నిజం. అయితే అలీ రెజా టైటిల్ గెలవాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు . అతని కుటుంబ సభ్యులు కూడా బలంగా కోరుకున్నారు . అందుకే ఆ విషయాన్ని అలీ రెజాకి తెలియకుండా చేసారు . ఇక షో నుండి వచ్చేసాక విషయం తెలుసుకున్నా అయన సోషల్‌ మీడియాలో భావోద్వేగమైన పోస్ట్‌ చేశాడు.

అలీ రెజా చేసిన పోస్ట్ ఇదే ...

'నా జీవితంలో విజయాన్ని చూడాలనుకున్నారు.. అయితే ఇప్పుడు నాపై ఎంతో మంది అభిమానం చూపిస్తున్నారు. ఎంతో మంది నన్ను ప్రేమిస్తున్నారు. కానీ ప్రస్తుతం మీరు అవన్నీ చూడలేకపోతున్నారు. మిమ్మల్ని చివరి క్షణంలోనైనా చూడలేకపోయాను. బిగ్‌బాస్‌ నాకెంత అవసరమో తల్లిదండ్రులకు తెలుసు.. అందుకే మీ గురించి నాకు తెలియనివ్వలేదు. అయినా వారికి తెలీదు మీరు కూడా నాకు అంతే ముఖ్యమని.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవ్వడమే నాకు ఓ షాక్‌లా ఉంటే.. బయటకు వచ్చాక మీరు లేరన్న వార్త మరింత షాక్‌కు గురిచేసింది. ఇంట్లో అనంతమైన బాధ ఉన్నా.. నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరూ నాకు సపోర్ట్‌ను ఇస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఇంతప్రేమను నేను చూశాకా.. నాకు ఇంకెమీ

అవసరం లేదనిపిస్తోంది. మామా నువ్వు బెస్ట్‌. నిన్ను అంతిమ సమయంలో చూడలేకపోయినందుకు నేనెప్పుడూ బాధపడుతూనే ఉంటాను. లవ్‌ యూ ఫర్‌ ఎవర్‌. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. " 


Tags:    

Similar News