Vijay Devarakonda to host the Biggboss4: బిగ్ బాస్ 4 హోస్టుగా విజయ్ దేవరకొండ..!
Vijay Devarakonda to host the Biggboss4: బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పాపులరో తెలిసిందే. ఈ షో ఇప్పటి వరకు తెలుగులో మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది.
Vijay Devarakonda to host the Biggboss4: బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంత పాపులరో తెలిసిందే. ఈ షో ఇప్పటి వరకు తెలుగులో మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ తరువాత ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చినా కూడా.. స్టార్లు ఎవ్వరూ కూడా పాల్గొనేందుకు ఆసక్తి చూపించట్లేదు. ఇక బుల్లితెర విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా కొంతమంది ఆర్టిస్టులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో.. ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్‌లకు హాజరు కావాలా.. లేక మరికొంత సమయం తీసుకోవాలో తెలియక టీవీ నటులు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బుల్లితెర సెన్సేషనల్ రియాల్టీ షో 'బిగ్ బాస్' గురించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక బిగ్ బాస్ పోయిన సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయ్యగా.. రెండవ సీజన్‌ను నాని, మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్‌గా అదరగొట్టారు.. తమ యాంకరింగ్‌తో సందడి చేశారు. ఇక నాల్గవ సీజన్ గురించి మాట్లాడితే.. కరోనా లేకపోయింటే ఇప్పుటికే ఈ షోకు సంబందించిన సన్నాహాలు, హాడావిడి జరుగుతుండేది. గత మూడు సీజన్‌లను చూసినట్లయితే బిగ్ బాస్ షో మార్చి ఏప్రిల్ నుండే ఏర్పాట్లు ప్రారంభం అవ్వుతుండేవి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ షో నిర్వాహకులు కొత్త సీజన్ కోసం సన్నాహాలు చేస్తున్నారట. అంతేకాదు ఈ సీజన్‌లో పాల్గొనే వారు కూడా కొంతమంది ఫైనల్ అయ్యారని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా హైపర్ ఆది, మంగ్లీ, తరుణ్, నందు, యాంకర్ ఝూన్సీ, సింగర్ సునీత, శ్రద్దా దాస్, వర్షిణి, వైవా హర్ష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటిదాకా 'తెలుగు బిగ్ బాస్ సీజన్ 4'కు తారక్, సమంతా, నాగార్జున హోస్ట్‌గా చేసే అవకాశం ఉందని ఇటీవల వార్తలు రాగా. తాజాగా రౌడీ విజయ్ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంలో విజయ్‌ను అడగడం.. ఆయన కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఒక వేళా.. బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌కు విజయ్ దేవరకొండ హోస్ట్‌గా వస్తే ఆ రియాలిటీ షోకు మరింత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే విజయ్ దేవరకొండ ప్రతీ ఇంటి సభ్యుడికి టీవీ ద్వారా మరింతగా చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఈ షో నాలుగో సీజన్ షూటింగ్ డిసెంబర్‌లో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.