Balakrishna: భీష్మావతారంలో బాలయ్య బాబు

భీష్మ ఏకాదశి సందర్భంగా బాలకృష్ణ సినీప్రియులకు ఓ చక్కటి కానుక అందించారు.

Update: 2021-02-24 05:35 GMT

ఫైల్ ఇమేజ్ 

Latest Tollywood News: నటరత్న నందమూరి బాలకృష్ణకు తన తండ్రి ఎన్టీయార్ నటించిన పౌరాణిక చిత్రాలన్నా, ఆయా పాత్రలన్నాఎంతో ఇష్టం. భీష్మ ఏకాదశి సందర్భంగా బాలకృష్ణ సినీప్రియులకు ఓ చక్కటి కానుక అందించారు. 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రంలో ఆయన భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్‌ను మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''నాన్న.. ఆయన వయసుకి మించిన భీష్మ పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్నారు. అందుకే నాకూ ఆ పాత్రంటే చాలా ఇష్టం. 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాం. అయితే నిడివి ఎక్కువ అవడం వల్ల చిత్రంలో వాటిని ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన అపురూప ఫొటోలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నాను'' అన్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. 'సింహా', 'లెజెండ్‌' వంటి హిట్ల తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న మూడో సినిమా. మే 28న విడుదలకానుంది.

Tags:    

Similar News