'అఖండ' విజయం.. బాక్సాఫీస్ బద్దకాన్ని వదిలించిన సినిమా
Akhanda Box Office Collections: కరోనా అనంతరం మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమకు ఉత్తేజాన్నిచ్చే టానిక్‌లా మారింది అఖండ విజయం.
Akhanda Box Office Collections: కరోనా అనంతరం మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమకు ఉత్తేజాన్నిచ్చే టానిక్‌లా మారింది అఖండ విజయం. ఉహించిన దాని కంటే ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య ఎనర్జీ లెవెల్స్‌కు తోడు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కలిసి అఖండ రీపిట్ ఆడియెన్స్‌తో బాక్సాఫీస్ బద్దకాన్ని వదిలించేస్తొంది. అఖండ ఇంతటి ఘన విజయాన్ని ఎలా సాధించింది? ఎందుకు సాధించిందన్న ప్రశ్నలకు సమాధానాల్ని చూసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. దీనికి సంబంధించి విశ్లేషణలు ఎలా ఉన్నా కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన పెద్ద హీరో సినిమా కావటం మాస్ మూవీ కవాడంతో విడుదలపై ఆసక్తిని కలిగించింది.
బాలయ్య పోషించిన అఖండ పాత్రే చిత్రంలో ప్రధాన బలంగా నిలిచింది. దానికి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులకు పూనకాలు తెప్పిచ్చింది. అన్నింటికి మించి అఖండ, శివుడి అంశగా తీర్చిదిద్దిన విధానం సరికొత్త ఫీల్‌ను కలిగించింది. అందువల్లే అఖండ పాత్ర ఏమైనా చేసేయగలదన్న కన్వీన్స్ సినిమాకు ప్లస్ అయ్యింది.
వసూళ్ల పరంగా కూడా అఖండ, విడుదలైన మూడు రోజుల్లో 63 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయగా వీక్ డేస్‌లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడి చేస్తోంది. తాజాగా 85 కోట్ల మార్కును దాటేసిన ఈ చిత్రం 100 కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతోంది. నిజానికి సీడేడ్ మినహా నైజాం ఏరియాలో బాలయ్య సినిమాలకు అంతగా కలెక్షన్ రాదు అన్న టాక్ ఉంది. అఖండ విషయంలో అదంతా ట్రాష్ అని అర్ధమవుతోంది. ఓవర్సీస్‌లో సైతం అఖండకు ఎదురులేకుండా పోయింది. సినిమా బాగుందన్న టాక్ అంతకంతకూ స్ప్రెడ్ అవుతున్న తరుణంలో, హిట్ సినిమాల్ని మాత్రమే థియేటర్లలో చూసేందుకు ఇష్టపడే ప్రేక్షకులు కూడా రీపిటెడ్‌గా సినిమాను చూడటం అఖండకు మరిన్ని కలెక్షన్లను తీసుకువస్తొంది.