Balakrishna: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులే సినిమాలో ఉన్నాయి
Balakrishna: ప్రజలకు వాస్తవాలు తెలుసు, వారి అభిమానాన్ని అడ్డుకోలేరు
Balakrishna: వీరసింహారెడ్డి సినిమా కథపై నందమూరి బాలకృష్ణ వివరణ ఇచ్చారు. చిత్రంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సంభాషణలు ఉన్నాయన్న ఆరోపణలపై బాలయ్య స్పందించారు. తిరుపతిలో వీరసింహారెడ్డి సినిమా చూసిన అనంతరం.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులనే సినిమాలో చూపించామని బాలయ్య తెలిపారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని... వారి అభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఇది ప్యాక్షన్ మూవీ కాదని... కుటుంబ సమేతంగా చూడదగిని చిత్రమన్నారు బాలయ్య.