Balagam 100+ Awards: సెంచరీ కొట్టిన ‘బలగం’.. సరికొత్త రికార్డ్ సొంతం!

Balagam Movie: మానవ సంబందాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం.

Update: 2023-07-05 07:19 GMT

Balagam 100+ Awards: సెంచరీ కొట్టిన ‘బలగం’.. సరికొత్త రికార్డ్ సొంతం!

Balagam Movie: మానవ సంబందాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం. ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ లీడ్ రోల్స్ లో నటించిన బలగం మూవీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. పల్లె పల్లెన.. ప్రతి గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు దర్శకుడు వేణు యెల్దండి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం కలెక్షన్ల వర్షం కురిపించింది. దిల్‌ రాజు సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు.

వెండితెరపై సత్తాచాటిన ఈ చిత్రాన్ని అవార్డులు అంతేస్థాయిలో వరించాయి. ఏకంగా అంతర్జాతీయ వేదికలపై బలగం పేరు మార్మోగింది. ఇంతవరకు ఏ సినిమా సాధించలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఏకంగా 100కిపైగా అంతర్జాతీయ అవార్డులు లభించినట్టు దర్శకుడు వేణు యెల్దండి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటివరకు మనకు 100 రోజులు విజయవంతంగా ఆడిన సినిమాలున్నాయి. 100 కేంద్రాల్లో ప్రదర్శితమైన సినిమాలున్నాయి. రూ. 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలూ ఉన్నాయి. ఇప్పుడు 100కిపైగా అంతర్జాతీయ అవార్డులు సాధించిన సినిమా ఉంది. ‘బలగం’ చాలా ప్రత్యేకం’’ అని వేణు తెలిపారు.


Tags:    

Similar News