మళ్ళీ వెండితెర పైకి బాహుబలి!
అయితే ఈ చిత్రాలను మరోసారి ధియేటర్లలలో చూసే అవకాశం కలగనుంది. బాహుబలి, బాహుబలి 2 హిందీ వెర్షన్ లను ధియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లుగా ఈ చిత్ర పంపిణిదారుడు కరణ్ జోహార్ వెల్లడించాడు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే.. ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగింది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలుగా వచ్చిన ఈ చిత్రం రెండు పార్ట్స్ గా వచ్చి ఎన్నో రికార్డులను సృష్టించింది.
అయితే ఈ చిత్రాలను మరోసారి ధియేటర్లలలో చూసే అవకాశం కలగనుంది. బాహుబలి, బాహుబలి 2 హిందీ వెర్షన్ లను ధియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లుగా ఈ చిత్ర పంపిణిదారుడు కరణ్ జోహార్ వెల్లడించాడు. బాహుబలి: ది బిగినింగ్ ఈ శుక్రవారం (నవంబర్ 6), రెండో భాగం బాహుబలి: ది కంక్లూజన్ ఆపై శుక్రవారం (నవంబర్ 13) విడుదల చేయనునట్లుగా వెల్లడించాడు. 2015లో మొదటి పార్ట్, 2017లో రెండవ పార్ట్ రిలీజ్ అయి కలెక్షన్ల పరంగా సినిమా భారతీయ సినీ చరిత్రలోనే రికార్డులను సృష్టించింది.
ఇక ఈ సినిమా తరవాత దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR అనే సినిమాని చేస్తున్నాడు. మొదటిసారిగా అగ్ర హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.