Avika Gor: అయ‌న‌ ఎప్పుడంటే అప్పుడు నేను పెళ్లికి రెడీ - అవికా గోర్

Avika Gor: చిన్నారి పెళ్లికూతురు(బాలిక‌వ‌ధు) సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకుంది

Update: 2021-05-20 17:28 GMT

అవికా గోర్

Avika Gor: చిన్నారి పెళ్లికూతురు(బాలిక‌వ‌ధు) సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకుల మ‌న‌సు గెలుచుకుంది అవికా గోర్‌. 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు ప‌రిచ‌యం అయింది. ఆ సినిమా ద్వారా త‌న అమాయ‌క‌త్వంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఆ సినిమా ఇచ్చిన విజ‌యంతో తెలుగులో వ‌రుస అవ‌కాశాలు వరించాయి. అయితే ఈ అమ్మ‌డు న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న‌క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వెళ్లింది.

'లక్ష్మీ రావే మా ఇంటికి', 'సినిమా చూపిస్త మావ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' వంటి పలు సినిమాలతో స‌క్సెస్ అందుకుంది. అడ‌ప‌ద‌డ‌ప సినిమాల్లో క‌నిపిస్తూ వ‌స్తుంది. అయినప్పటికీ తెలుగులో సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ భామ ఇటీవల హిందీలో కాదిల్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటుడు ఆదిల్‌ ఖాన్‌ సరసన ఆడిపాడింది. అవికా త్వ‌రలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమైంట. కొంతకాలంగా ఆమె హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

హిందీలో రోడీస్‌ 17 కంటెస్టెంట్‌ వచ్చిన మిలింద్‌ ఓ ఎన్‌జీవో సంస్థను నడుపుతున్నాడు. విషయాన్ని ఆమె గతేడాది సోషల్‌ మీడియాలో అధికారికంగా వెల్లడించింది. ఈ క్రమంలో ఓ ఎన్జీవో కార్యక్రమంలో పాల్గోన్న అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు ఆమె తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అవికా తన ప్రేమ, పెళ్లి విషయమై నోరు విప్పింది. ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ.. 'నేను మిలింద్‌ను హైదరాబాద్‌లో కలుసుకున్నాను. ఓ ఎన్జీవో కోసం పనిచేస్తున్న క్రమంలో అక్కడే ఫస్ట్‌టైం చూశాను. తొలిచూపులోనే అతడికి ఇంప్రెస్‌ అయ్యా.అయితే మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. ఒకరిని గురించి ఒకరం పూర్తిగా అర్థం చేసుకున్నాకే మా ప్రేమను వ్యక్తం చేసుకున్నాం.

నిజం చెప్పాలంటూ మా ప్రేమ క‌థ‌ దక్షిణాది సినిమాల ప్రేమకథలా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి ఎప్పుడని హోస్ట్‌ అడగ్గా.. 'ఇప్పుడే నాది పెళ్లి వయసు కాదు. కానీ మిలింద్‌ చేసుకుందామని అడిగితే దానికి నేను రెడీగా ఉన్నాను. తను రేపే పెళ్లి చేసుకుందామన్నా కూడా అందుకు నేను సిద్దం' అని అవికా పేర్కొంది.


Tags:    

Similar News