Andhra Pradesh: థియేటర్ల రీఓపెన్కు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh: 8వ తేదీ నుంచి 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతులు మంజూరు చేసింది.
Andhra Pradesh: సినీ ప్రియులకు ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. జూలై 8 నుంచి 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతులు మంజూరు చేసింది. అయితే థియేటర్లలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలను కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వంద శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు ఓపెన్ చేయవచ్చని అనుమతి ఇచ్చినా .. ఇప్పటికీ ఒక్క కొత్త సినిమా విడుదల కాలేదు. అలాగే ప్రేక్షకుల తాకిడి కూడా అంతగా కనిపించడం లేదు. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ సందడి మళ్లీ షూరు అయ్యేలాగే కనిపిస్తుంది.
గతేడాది కరోనా ప్రభావం.. థియేటర్లు మూత పడి.. తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకుగా.. అన్ని చిన్న సినిమాలే విడుదలై మంచి విజయం అందుకున్నాయి. ఇక క్రమంగా కరోనా భయాన్ని పక్కన పెట్టి.. థియేటర్లకు ఆడియోన్స్ తాకిడి పెరుగుతున్న సమయంలో కరోనా మరోసారి పంజా విసిరింది. థియేటర్లు ఓపెన్ అయిన రెండు మూడు నెలల్లోనే మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో విజృంభించింది. దీంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించకంటే ముందే థియేటర్లు మూతపడిపోయాయి. ప్రస్తుతం కోవీడ్ కేసులు తగ్గుతుండడంతో.. ప్రభుత్వాలు పలు సంస్థలకు సడలింపులు ఇస్తున్నాయి.