Unstoppable Season 2: బాలకృష్ణ షో కి గెస్ట్ గా విచ్చేయనున్న స్టార్ హీరోయిన్

Unstoppable Season 2: బాలకృష్ణ సెలబ్రిటీ టాక్ షో కి అనుష్క ఎంట్రీ

Update: 2022-09-22 02:54 GMT
Anushka Shetty Will Be Unstoppable Season 2 Guest

Unstoppable Season 2: బాలకృష్ణ షో కి గెస్ట్ గా విచ్చేయనున్న స్టార్ హీరోయిన్

  • whatsapp icon

Unstoppable Season 2: అప్పటిదాకా కేవలం వెండితెరపై మాత్రమే తన సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన నందమూరి బాలకృష్ణ "అన్‌స్టాప‌బుల్" సెలబ్రిటీ టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులలో కూడా మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్నారు. డిజిటల్ ప్లాట్ఫారం ఆహాలో ప్రసారమైన ఈ షో మొదటి సీజన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే. మొదటి సీజన్లోనే చాలామంది సెలబ్రిటీలను గెస్ట్లుగా ఆహ్వానించిన బాలకృష్ణ తాజాగా ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ సీజన్ 2తో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. అతి త్వరలోనే అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 లో బాలకృష్ణ ఎలాంటి సెలబ్రిటీలను ఆహ్వానించనున్నారు అని కూడా చర్చలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం స్టార్ బ్యూటీ అనుష్క కూడా అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 లో గెస్ట్ లు గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా అనుష్క మీడియా ముందుకి రాకుండా కెమెరా ని కూడా అవాయిడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాగా బరువు పెరిగిన అనుష్క వెయిట్ తగ్గేంత వరకు మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం అనుష్క ఇప్పుడు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 కి గెస్ట్ గా విచ్చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Tags:    

Similar News