ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట మరో వేడుక.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. దిల్ రాజు.. తేజస్వినిని నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. 2017లో దిల్ రాజు భార్య అనిత మరణించడంతో. అప్పటి నుంచి దిల్ రాజుని మరో పెళ్లి చేసుకోవాలని ఆయనపై కుమార్తె హన్షిత రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. దిల్ రాజు.. తేజస్వినిని నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. 2017లో దిల్ రాజు భార్య అనిత మరణించడంతో. అప్పటి నుంచి దిల్ రాజుని మరో పెళ్లి చేసుకోవాలని ఆయనపై కుమార్తె హన్షిత రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రిని ఒప్పించి.. దగ్గరుండి మరీ పెళ్లి జరిపించింది హన్షిత. అయితే.. ఇప్పుడు దిల్ రాజు ఇంట మరో వేడుక జరిగింది. దిల్ రాజు మనవారాలు ఇషిక అన్నప్రాసన వేడుక.
హన్షిత కుమార్తె ఇషిక అన్నప్రాసన వేడుక హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో జరిగింది. ఈ వేడుకలో దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మనవరాలిని ఎత్తుకుని ఆడించారు దిల్ రాజు. ఈ అన్నప్రాసన వేడుకకు సంబందించిన ఫొటోలను హన్షిత రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'ఇషిక జన్మించి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా ఆరో నెల ఆరో రోజు అన్నప్రాసన వేడుక' అంటూ హన్షిత పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో చిన్నారి ఇషిక పట్టు వస్త్రాల్లో మెరిసిపోతుండటం చూడవచ్చు.