Angelina Jolie: ఓ ఆప్ఘన్ బాలిక కన్నీటి వేదనను పోస్ట్ చేసిన ఏంజెలినా జోలి
* ఆఫ్ఘన్ల వెతలపై చలించిపోయిన ఏంజెలినా జోలి * వారి కష్టాలు, కన్నీళ్లు తెలియ చెప్పేందుకు ఇన్ స్టా ఖాతా
Angelina Jolie: సామాజిక అంశాలపై స్పందించే హాలీవుడ్ నటి ఎంజెలినా జోలీ ఆప్ఘన్ల కష్టాలు,కన్నీళ్లు చూసి ఆవేదన చెందుతున్నారు. తాలిబన్ల ఆగడాలకు బలవుతున్న మహిళలు, చిన్నారులకు తన మద్దతు ప్రకటించారు. ఆప్ఘన్ల బాధలను ప్రపంచానికి చెప్పడానికే తాను ఇన్ స్టా గ్రామ్ ఖాతా ఓపెన్ చేసినట్లు ఎంజెలినా ప్రకటించారు. మానవ హక్కుల కోసం పోరాడతున్న వారి గళాన్ని ప్రపంచానికి చేరవేయడమే తన లక్ష్యమని అందుకే ఇన్ స్టాలో చేరానని జోలీ అంటున్నారు. ఆప్ఘన్ వాసులు పడుతున్న కష్టంపై ఓ బాలిక ఆవేదనతో రాసిన లేఖను ఆమె ఇన్ స్టా లో షేర్ చేశారు.ఆప్ఘన్లకు అండగా ఉండటమే కాదు. వారి కష్టాలు, కన్నీళ్లను ప్రపంచానికి చేరవేస్తానని ఏంజెలినా జోలీ మాటిచ్చారు. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఏంజెలినా ఆప్ఘన్ ఆవేదన చూసి చలించి ఇన్ స్టా ఖాతా తెరిచారు. ఆమె ఎక్కౌంట్ కు క్షణాల్లోనే 40 లక్షలమంది ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఏంజెలినా పోస్ట్ విపరీతంగా వైరల్ అయ్యింది.