యాంకర్ ప్రదీప్ తో శ్రీముఖికి పెళ్లి.. దసరాకే ముహూర్తం!

Anchor Pradeep Marriage : ప్రతి పండగకి ఎదో ఒక ఈవెంట్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటాయి ఛానళ్ళు.. అందులో భాగంగానే రాబోతున్న దసరాకి ఓ ఈవెంట్ ని ప్లాన్ చేసింది ఓ ఛానల్.. అయితే ఈ ఈవెంట్ లో యంగ్ యాంకర్స్ శ్రీముఖి, ప్రదీప్ కి పెళ్ళంటూ ఓ ప్రోమోను కూడా రీలిజ్ చేసి పెద్ద హైప్ ని తీసుకువచ్చింది.

Update: 2020-10-17 13:01 GMT

Anchor Pradeep Marriage : ప్రతి పండగకి ఎదో ఒక ఈవెంట్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంటాయి ఛానళ్ళు.. అందులో భాగంగానే రాబోతున్న దసరాకి ఓ ఈవెంట్ ని ప్లాన్ చేసింది ఓ ఛానల్.. అయితే ఈ ఈవెంట్ లో యంగ్ యాంకర్స్ శ్రీముఖి, ప్రదీప్ కి పెళ్ళంటూ ఓ ప్రోమోను కూడా రీలిజ్ చేసి పెద్ద హైప్ ని తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ ప్రోమోలో చిరంజీవి ప్రదీప్‌కి చిలసౌ శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది అంటూ.. ఓ వెడ్డింగ్ కార్డును కూడా బయటకు వదిలింది.

అయితే ఈ వెడ్డింగ్ కార్డులో ఏముందో తెలుసుకోవాలి అంటే దసరా స్పెషల్ ఈవెంట్ చూడాల్సిందేనని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ప్రోమోకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ అంటూ బుల్లితెర ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక యాంకర్ ప్రదీప్ కి త్వరలోనే పెళ్ళంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఈ ఈవెంట్ వస్తుండడంతో పెద్ద హైప్ ను క్రియేట్ అయ్యింది.

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే అవకాశాలు వచ్చినప్పుడు వెండితెరపై మెరుస్తుంటాడు ప్రదీప్‌ .. ప్రస్తుతం ప్రదీప్‌ హీరోగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎస్.వి. ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి. బాబు సినిమాని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News