అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు సార్!
Amitabh Bachchan Reveals : అమితాబ్ బచ్చన్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. ఎన్నో సినిమాలు... ఎన్నో పాత్రలు పోషించి కొన్ని కోట్ల
Amitabh Bachchan Reveals : అమితాబ్ బచ్చన్.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కరలేదు.. ఎన్నో సినిమాలు... ఎన్నో పాత్రలు పోషించి కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం బిగ్ బీ వయసు 77 సంవత్సరాలు.. అయినప్పటికీ ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా నేటికి అయన 14 గంటలు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా వెల్లడించారు. తెల్లవారుజామునే షూట్‌కు వెళ్తున్నట్టుగా బిగ్ బీ వెల్లడించారు అమితాబ్... " ప్రపంచంలో పోటీ బాగా పెరిగిపోయింది. నేను రోజులో 12 నుంచి 14 గంటలు పనిచేస్తున్నాను అని అన్నారు.. నా స్టాప్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తోంది. మనిషి అనుకుంటో సాధించలేనిది ఏదీ లేదు. 'సాధ్యం కానిది లేదు' అనే ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ప్రతి నిమిషం, ప్రతి గంటలో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని అమితాబ్ పేర్కొన్నారు.
ఇక అమితాబ్ బచ్చన్ తాజాగా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. అమితాబ్ తో పాటుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాద్యకు కూడా కరోనా సోకింది. దీనితో వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందారు. అనంతరం కోరోనాను జయించారు. అయినప్పటికీ అమితాబ్ ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా కష్టపడుతున్నారు. తను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోతో పాటుగా పలు సినిమాలకి సంబంధించిన కథలను వింటున్నారు. అయన ఈ వయసులో రోజులో 14 గంటల పాటు వర్క్ చేయడం అంటే మాములు విషయం కాదు కదా. ఇక దీనిపట్ల నెటిజన్లు స్పందిస్తూ.. అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.