Bigg Boss 7 Telugu: మొదలైన గ్రాండ్ ఫినాలే షూటింగ్.. తొలి ఎలిమినేట్ ఎవరంటే?

Bigg Boss 7 Telugu Elimination: బిగ్‌బాస్‌ తెలుగు 7వ సీజన్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది.

Update: 2023-12-16 11:05 GMT

Bigg Boss 7 Telugu: మొదలైన గ్రాండ్ ఫినాలే షూటింగ్.. తొలి ఎలిమినేట్ ఎవరంటే?

Bigg Boss 7 Telugu Elimination: బిగ్‌బాస్‌ తెలుగు 7వ సీజన్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. రేపు అంటే ఆదివారంతో 7వ సీజన్‌కు ముగింపు కార్డు పడనుంది. అయితే, 7వ సీజన్ ఫైనల్‌కు ఎంతమంది వెళ్తారనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటది అనుకున్నారు.. కానీ, అదేమీ లేకుండా డైరెక్టుగానే ఫైనల్‌కు ముందురోజు నేడు అంటే, శనివారం ఒకరిని ఎలిమినేట్ చేశారు. దీంతో మొత్తంగా గ్రాండ్ ఫినాలేకు ఆరుగురు వెళ్లనున్నారు.

బిగ్ బాస్ 7 సీజన్ తెలుగు గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టనున్న వారిలో అర్జున్‌, ప్రశాంత్‌, శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక, అమర్‌దీప్‌ ఉన్నారు. అయితే, వీరిలో అర్జున్‌ 2వారాల క్రితమే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్‌ అవ్వాల్సింది. కానీ, ఫినాలే అస్త్ర ఉపయోగించుకుని 7వ సీజన్‌లోనే తొలి ఫైనలిస్టుగా మారాడు.

మొదలైన గ్రాండ్‌ ఫినాలే ఈవెంట్..

7వ సీజన్‌లో తొలి ఫైనలిస్టుగా గ్రాండ్‌గా ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాడు. అయితే, గ్రాండ్ ఫినాలేలో మాత్రం తొలి ఎలిమినేషన్‌లో లక్ పొందలేకపోయాడు. దీంతో గ్రాండ్ ఫినాలే నుంచి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్‌గా మారాడు.

కాగా, ఇప్పటికే రేపటి గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ షూటింగ్ మొదలైంది. ఈ రోజు ఉదయం నుంచే ఎంతో గ్రాండ్‌గా షూటింగ్‌ ప్రారంభించారంట. ఈ క్రమంలో ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లతో డ్యాన్స్‌లు, సరదా ఆటలు ఆడించారంట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News