సినీ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఏఎంబీ
దీనితో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్నికోట్ల నష్టాన్నిచూసింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ధియెటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో షోలను ప్రారంభించుకునేందుకు యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి.
కరోనా వలన ఏర్పడిన లాక్ డౌన్ వలన ధియెటర్లు మూతపడ్డాయి. షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్నికోట్ల నష్టాన్నిచూసింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ధియెటర్లను తిరిగి తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. దీనితో షోలను ప్రారంభించుకునేందుకు యాజమాన్యాలు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ గచ్చిబౌలిలోని AMB సినిమాస్ ఈ నెల 4 వ తేది నుంచి సినిమాలను ప్రదర్శించేందుకు సిద్దమైనట్లుగా ప్రకటించింది.
ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ అంటూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ కోవాలనే మరిన్ని ధియెటర్లు కూడా తెరుచుకోనున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ధియెటర్లు రీఓపెన్ చేయడం సరే మరి ప్రేక్షకులు కూడా ఆ స్థాయిలో వస్తారా లేదా అన్నది చూడాలి. అటు 50 శాతం ఆక్యుపెన్సీతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్స్ రన్ చేసుకోవచ్చునని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే!