Radhe Shyam: రాధేశ్యామ్‌కు భారీ ఆఫర్ ఇచ్చిన ఓటీటీ?
Radhe Shyam: రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్.
Radhe Shyam: రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్లో పెరిగిన సంగతి తెలిసిందే. అలాగా ఆయన సినిమాలకు అదే రేంజ్లో డిమాండ్ కూడా పెరిగిపోతోంది. బాహుబలి బ్లాక్ బస్టర్ తరువాత, సాహో బోల్తాకొట్టింది. అయినా మనోడి క్రేజ్ మాత్రం తగ్గలే. తాజాగా రాధేశ్యామ్, సలార్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ రెండూ కూడా హైరేంజ్ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. 'రాధేశ్యామ్' సినిమాపై ఓ వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.
ఈ సినిమా విడుదల కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. కాగా, ప్రభాస్ సరసన పూజా హెగ్డే రోమాన్స్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పలు కారణాలతో విడుదల ఆలస్యమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ డీల్‌తో నిర్మాతలకు షాక్ ఇచ్చిందంట. దాదాపు రూ. 400 కోట్ల ప్రైజ్‌ను ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. దీంతో చాలా సినిమాలు ఓటీటీల బాటను పడుతున్నాయి. తాజగా బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమా కూడా ఇలానే విడులయ్యింది. పే పర్ వ్యూ పద్ధతిలో జీ సంస్థ ఈ సినిమాను రూ. 250 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఓ రేంజ్లో సక్సెస్ అయింది. దీంతో ఇదే పద్ధతిలో వెళ్లాలని అమెజాన్ ప్రైమ్ కూడా యూవీ
క్రియోషన్స్ కు భారీ డీల్ అందించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో ఈ సినిమా కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.300 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైందని, కానీ, ఈ ఆఫర్‌ను యూవీ క్రియోషన్స్ వద్దనుకుందనే వార్తలు వినిపించాయి.
మరి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఇచ్చిన ఆఫర్ ను నిర్మాతలు ఓకే చేస్తారా? లేదా చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ ఆఫర్‌కు నిర్మాతలు సై అంటే.. టాలీవుడ్లో ప్రభాస్ రికార్డుల్లోకి ఎక్కినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. బాలీవుడ్‌ని ఫాలో అవుతారా? లేదా థియేటర్లు ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేస్తారా అనేది త్వరలో తెలియనుంది.