అల్లుడు సెంటిమెంట్ నే నమ్ముకున్న బెల్లంకొండ హీరో

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి కొదవే లేదు.. నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ దాదాపుగా నడిచేది సెంటిమెంట్ చుట్టే అన్నది కాదనలేని వాస్తవం.. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్.

Update: 2020-03-12 06:26 GMT
Alludu adhurs

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి కొదవే లేదు.. నిజం చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ దాదాపుగా నడిచేది సెంటిమెంట్ చుట్టే అన్నది కాదనలేని వాస్తవం.. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయి శ్రీనివాస్.. మొదటి సినిమా 'అల్లుడు శీను' తో పరవాలేదు అనిపించి గత ఏడాది రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇక సినిమా మంచి హిట్ కావడంతో కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చాడు. అందులో భాగంగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో సినిమాని చేసేందుకు సిద్దం అయ్యాడు.

ఈ సినిమా కి 'అల్లుడు అదుర్స్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేసింది చిత్రబృందం.. విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సాయి శ్రీనివాస్ సరసన న‌భా న‌టేష్‌, అను ఎమ్మాన్యుయేల్ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న 8 ప్యాక్స్‌తో మెప్పించానున్నాడు సాయి.. ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 30న విడుద‌ల చేయనున్నారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . డూడ్లే ఈ సినిమాకు సినిమాటోగ్రఫిని అందిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. 



 


Tags:    

Similar News