Allu Aravind: దిల్ రాజు సినిమా వివాదం పై అల్లు అరవింద్ ఏమన్నారంటే..

* కానీ ఆ ఒప్పందానికి కట్టు పడకుండా దిల్ రాజు ఇప్పుడు ఈ సినిమా ని తెలుగులో రిలీజ్ చేయడంపై కొందరు వేలెత్తి చూపిస్తున్నారు

Update: 2022-11-20 08:05 GMT

Allu Aravind: దిల్ రాజు సినిమా వివాదం పై అల్లు అరవింద్ ఏమన్నారంటే.. 

Allu Aravind: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు తన మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమాతో బిజీగా ఉన్నారు. తమిళంలో "వారీసు" అనే టైటిల్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగులో "వారసుడు" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. "మహర్షి" సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మరియు ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ తో చిత్ర బృందం బిజీగా ఉంది. అయితే తాజాగా ఇప్పుడు తెలుగులో ఈ సినిమా ఒక వివాదంలో ఇరుక్కుంది.

గతంలో తమిళ్ సినిమాలను పండగల సమయంలో విడుదల చేయకూడదని కేవలం తెలుగు సినిమాలకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు ఒక ఒప్పందానికి వచ్చారు. కానీ ఆ ఒప్పందానికి కట్టు పడకుండా దిల్ రాజు ఇప్పుడు "వారసుడు" సినిమా అని తెలుగులో రిలీజ్ చేయడం పై కొందరు వేలెత్తి చూపిస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్మాతల మండలి పండగ సమయంలో తెలుగు సినిమాలు మాత్రమే విడుదల అవ్వాలి ఆ తరువాతే అనువాద సినిమాలకు సపోర్ట్ ఇవ్వాలి అని ఒక పత్రిక ప్రకటనని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్టార్ ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ స్పందించారు. "సినిమాలను అడ్డుకోవడం సాధ్యం కాదని సినిమాలకు ఎలాంటి ఎల్లలు లేవని అన్నారు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా మంచి సినిమా అయితే ఎక్కడైనా ఆడుతుందని అని అల్లు అరవింద్ అన్నారు. నిర్మాతల మండలి కూడా డబ్బింగ్ సినిమాలని అడ్డుకుంటామని చెప్పలేదని, కేవలం తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మాత్రమే చెప్పామని స్పష్టం చేసింది. 

Tags:    

Similar News