Pushpa Hindi Version: హిందీలో పుష్ప నిర్మాతలకి దక్కింది తక్కువేనా?
Pushpa Hindi Version: హిందీలో పుష్ప నిర్మాతలకు తక్కువ వాటా వచ్చిందా?
Pushpa Hindi Version: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ఈ మధ్యనే థియేటర్లలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. కేరళ లో అల్లు అర్జున్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మలయాళంలో సినిమా హిట్ అవ్వడం కూడా అందరూ ఊహించిన విషయమే. ఇక సినిమా కథ కొంచెం తమిళ్ నేటివిటీకి దగ్గరగా ఉండడంతో తమిళంలో కూడా సినిమాకి మంచి క్రేజ్ లభించింది. కానీ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై హిందీలో పుష్ప సినిమా 85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు చేయడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
నిజానికి హిందీ వర్షన్ హక్కులను అమ్మింది కేవలం పది కోట్ల కి మాత్రమే. ఈ సినిమాని డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చేసిన అదే మేరకు ఆదాయం వస్తుంది. ఈ నేపథ్యంలో గోల్డ్ మైన్స్ సంస్థ థియేట్రికల్ రైట్స్ ని తీసుకొని సినిమాని విడుదల చేసింది భారీ ప్రోఫిట్లు నమోదు చేసుకుంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు బాగానే వెనకేసుకు ఉన్నప్పటికీ పుష్ప నిర్మాతలకి దక్కింది పెద్దగా లేదు. నిజానికి ఆదాయంలో 50 50 తీసుకునే లాగా ఒక మాట అనుకున్నారు కానీ ట్రేడ్ వర్గాలు చూపిస్తున్న కలెక్షన్ లకు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు అధికారికంగా చూపిస్తున్న నంబర్ లకి కొంచెం తేడా ఉంది. దీంతో వాటా ప్రకారం కూడా తక్కువ మాత్రమే ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప 1 సంగతి పక్కన పెడితే "పుష్ప 2" సినిమా కోసం మాత్రం థియేట్రికల్ హక్కులు 70 నుంచి 80 కోట్ల వరకు ఉండచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.