Allu Arjun: అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట.. కీలక నిర్ణయం తీసుకుంటూ..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్ధతుగా ఆయన ఇంటికి వెళ్లారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి మద్ధతుగా ఆయన ఇంటికి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున శిల్పా ఇంటికి చేరుకున్నారు. అయితే దీనిని ఎన్నికల నియమావళి ఉల్లంఘన పరిగణించి అప్పట్లో అల్లు అర్జున్‌తో పాటు, శిల్లా రవిపై కేసు నమోదైంది.
ఈ నేపథ్యంలోనే ఈ కేసులో తనపై విచారణ నిలిపివేయాలని బన్నీ ఇటీవల ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నియమావళి కింద నమోదైన కేసు కొట్టి వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా హైకోర్ట్ కీలక తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా బన్నీకి బిగ్ రిలీఫ్ లభించింది. బన్నీతో పాటు మాజీఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హై కోర్టు లో వాదనలు ముగిశాయి.
ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసం.. నవంబర్ 8 న నిర్ణయం వెల్లడిస్తామని హై కోర్టు తెలిపింది. అప్పటి వరకు ఎఫ్ ఐ ఆర్ అధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై నవంబర్ 8 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అలాగే ఈ కేసుపై నవంబర్ 8న తదుపరి ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు పేర్కొంది.
ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మొదటి చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప2 పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి భారీ అంచనాల నడుమ విడుదలవుతోన్న పుష్ప సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.