All Cine Industry Praying for SP Balasubrahmanyam health: దివిలో తిరిగే గంధర్వులు భువికి దిగి వచ్చి పాడినట్లుగా ఉంటుందా గాత్రం. ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి. గ్రీష్మం నిప్పులు చిమ్మినా వసంతం వన్నెలు అద్దినా అదే నిర్మలతత్వం అదే నిశ్చల అంతరంగం. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం భాషతో సంబంధం లేకుండా ఆయన గొంతులో ఓంకార నాదాలు సందానమై నిలుస్తాయి. ఆయన పాట పంచామృతం. ఆ గాన గంధర్వుడు ఇప్పుడు కరోనా మహమ్మారితో యద్ధం చేస్తున్నాడు.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. ఆయన పాడిన పాటలు మనల్ని ఆప్యాయంగా పలకరించాయి! ఆయన పాటతో కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ గుటుకట్టుకుంది. బాలు గాత్రానికి ప్రకృతి కూడా పర్వశించి సరిగమలు పాడుతున్నట్లు కదులుతోంది. గాలి కదం చిదిస్తూ సువాసన వెదజల్లుతోంది. సృష్టిరహస్యంలా అర్థంకాని ఆయన గొంతులోని మాధుర్యాన్నికి పదాలే ఉక్కిరిబిక్కిరి అయి తరంగాలుగా బయటకు వస్తాయి. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఆయన తన గుంతు తడిపారు.
ఐదు దశాబ్దాలకు పైగా భారతదేశంలోని పలు భాషల్లో తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను అలరించిన బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుంది.
బాలు కోలుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులు ప్రార్థించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఇళయరాజా, కమల్‌హాసన్, చిరంజీవి, ఖుష్బూ, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు SPB కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బాలు త్వరగా కోలుకోవాలని సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్,హరీస్ జైరాజ్, అనిరుధ్, నిర్మాత బోనీ కపూర్, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థిస్తున్నారు. ఈ లెజెండరీ గాయకుడు తన అద్భుతమైన గాత్రంతో మనకెంతో ఆనందాన్ని పంచాడని చెప్పిన రెహమాన్, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా త్వరగా కోలుకుని రా మిత్రమా అంటూ భావోద్వేగంగా స్పందించారు. 'బాలు మీరు త్వరగా వచ్చేయండి. మీకోసం ఎదురుచూస్తున్నాను. మన జీవితాలు సినిమాతో మొదలుకాలేదు, సినిమాతో ముగిసిపోవు అంటూ చెప్పారు. గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని HMTV ఆశిస్తోంది.