Rana, Miheeka Marriage : రానా.. ఇక శాశ్వతంగా లాక్డ్-డౌన్: అక్షయ్ కుమార్
Rana, Miheeka Marriage: హీరో రానా దగ్గుబాటి ఆయన ప్రేయసి మరి కొద్ది గంటలలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. కరోనా వలన రామానాయుడు స్టూడియోలో కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనుంది. అనేక జాగ్రత్తల మధ్య పెళ్ళి జరుపుకుంటున్న రానా- మిహికాలకి స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ ట్విటర్ ద్వారా రానాకు విషెస్ తెలియజేశాడు. `శాశ్వతంగా లాక్డ్-డౌన్ కావడానికి ఇదే సరైన మార్గం. కంగ్రాట్స్ రానా.. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాన`ని అక్షయ్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. రానా- మిహికా దంపతులకి ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Perfect way to get permanently locked-down :) Congratulations @RanaDaggubati , wishing you both a lifetime of happiness ♥️ https://t.co/asr7d0Vrf2
— Akshay Kumar (@akshaykumar) August 8, 2020
For more latest Tollywood News Videos, please visit our YouTube Channel