ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడు ముందుంటాడు. ఇప్పటికే చాలా మందికి సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు అక్షయ్... ఇలా మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు ఈ బాలీవుడ్ హీరో.. దర్శకుడు రాఘవ లారెన్స్ తో కలిసి చెన్నైలో హిజ్రాల కోసం నిర్మిస్తున్న భవనానికి ఆయన రూ.కోటిన్నర విరాళమిచ్చారు. ఈ విషయాన్నీ లారెన్స్ తన ఫేస్ బుక్ ద్వారా ప్రకటించాడు.
ఇక లారెన్స్ కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదా లారెన్స్ చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్స్ చేశాడు. కలాంగులకు విద్య, వసతి, ఆరోగ్యం వంటి సదుపాయలు కల్పించాడు కూడా.. అయితే తన చారిటబుల్ ట్రస్ట్ 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చెన్నైలోని ట్రాన్స్ జెండర్స్ వసతికోసం ఓ భవనాన్ని నిర్మించాలని అనుకున్నాడు.
'హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్, నేను ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను.. లక్ష్మీబాంబ్' షూటింగ్ సందర్భంగా మా ట్రస్ట్ ప్రాజెక్టుల గురించి, హిజ్రాలకు ఇళ్ల నిర్మాణం గురించి అక్షయ్ సార్‌తో మాట్లాడాగా అయన మరో మారు ఆలోచించకుండా కోటిన్నర రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయనకి మా కృతజ్ఞతలు.. ప్రస్తుతం మా ట్రస్ట్ ద్వారా భూమిని సేకరిస్తాం. ఇళ్ల నిర్మాణం కోసం మరిన్ని నిధులు సేకరిస్తున్నామని లారెన్స్ పేర్కొన్నారు. అంతేకాకుండా హిజ్రాల గృహ నిర్మాణం కోసం ఓ హీరో ఇంత పెద్దమొత్తంలో విరాళం ప్రకటించడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చాడు.
ఇక లారెన్స్ డాన్స్ కోరియోగ్రఫర్ గా కెరీర్ ని మొదలు పెట్టి ఆ తర్వాత నటుడుగా, దర్శకుడిగా ఎదిగారు. తమిళ్, తెలుగు, హిందీ భాషలలో సినిమాలు చేసి మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక తెలుగులో కాంచన, ముని సిరీస్ లతో లారెన్స్ మంచి దర్శకుడిగా విశేషమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.