Aishwarya rai , Aaradhya Discharged from Hospital: క‌రోనాను జ‌యించిన ఐశ్వ‌ర్య, ఆరాధ్య‌

Aishwarya rai, Aaradhya Discharged from Hospital: బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు క‌రోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల కింద హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

Update: 2020-07-27 12:29 GMT
aishwarya rai bachchan, aaradhya bachchan

Aishwarya, Aaradhya Discharged from Hospital: బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యకు క‌రోనా పాజిటివ్ రావడంతో వారం రోజుల కింద హోమ్ క్వారంటైన్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తాజా చేసిన టెస్టుల్లో వారిద్ద‌రికి నెగిటివ్ వ‌చ్చింది. దీంతో వారిద్ద‌రిని సోమ‌వారం మ‌ధ్యాహ్నం ముంబయి లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసాడు.

ఇదే విషయాన్ని ఐశ్వర్య భర్త అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేసాడు. తన భార్యతో పాటు కూతురుకు కూడా నెగిటివ్ వచ్చిందని.. దాంతో వాళ్లను డిశ్చార్జ్ చేసారని తెలిపాడు. కానీ తాను, త‌న‌ తండ్రి బిగ్ బీ అమితాబ్‌లు ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నామని.. మరికొన్ని రోజులు వైద్యుల సమక్షంలోనే ఉండాలని సూచించినట్టు పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న అభిమానులు సంతోష వ్య‌క్తం చేస్తున్నారు. బిగ్ బీ అమితాబ్, అభిషేక్ లు కూడా త్వరగా కోలుకోవాలని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. రెండు వారాల కిందట బిగ్ బి‌తో పాటు అభిషేక్ బ‌చ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొన్ని రోజులు ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉన్న ఐష్, ఆరాధ్యలకు లక్షణాలు ఎక్కువు అవుతున్న నేపథ్యంలో వారం కిందట అదే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు.


Tags:    

Similar News