టికెట్లు రేట్లు గురించి మళ్ళీ క్లారిటీ ఇచ్చిన అడవి శేష్

* టికెట్లు రేట్లు గురించి మళ్ళీ క్లారిటీ ఇచ్చిన అడవి శేష్

Update: 2022-06-01 09:00 GMT
Adivi Sesh Gave Clarity Again About Ticket Rates | Tollywood News

టికెట్లు రేట్లు గురించి మళ్ళీ క్లారిటీ ఇచ్చిన అడవి శేష్

  • whatsapp icon

Adivi Sesh: అడవి శేష్ హీరోగా "గూఢచారి" డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "మేజర్". 26/11 ఎటాక్ లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. సయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 3న థియేటర్లలో విడుదల కాబోతుంది.

అయితే సినిమా విడుదలకు ముందు మిగతా సినిమాల కాకుండా మేజర్ సినిమా టికెట్ రేట్లు మామూలుగానే ఉంటాయని ఎక్కువగా ఉండవని సోషల్ మీడియా ద్వారా తెలియ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా టికెట్లు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని కొన్ని థియేటర్లలో వారు ఇంకా సినిమా టికెట్లను ఎక్కువ రేట్లకే అమ్ముతున్నారని ఒక నెటిజన్ అడివి శేష్ కి ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో సంధ్య 35 ఎం ఎం థియేటర్ వారితో మాట్లాడాను అని, వారు కూడా సినిమా టికెట్లు చేయడానికి ఒప్పుకున్నారని సినిమాని వంటి ఈ సినిమాని అందరికీ అందుబాటులో ఉండేలా చేయడమే తమకు కావాలని చెప్పిన అడవి శేష్ తగ్గిన టికెట్ రేట్లను స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటో ని కూడా షేర్ చేశారు. శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ని సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల ఈ సినిమా కి సంగీతాన్ని అందించారు.

Tags:    

Similar News