బిగ్ బాస్ తర్వాత చచ్చిపోవాలనిపించింది.. వితికా షాకింగ్ కామెంట్స్!
vithika sheru : బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి జంటగా వచ్చి అందరిని అలరించింది నటి వితికా షెరు.. ఈ షోలో ఆమె 13 వారాలు
vithika sheru : బిగ్ బాస్ సీజన్ 3లో భర్త వరుణ్ సందేశ్‌తో కలిసి జంటగా వచ్చి అందరిని అలరించింది నటి వితికా షెరు.. ఈ షోలో ఆమె 13 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో ఉంది వితికా .. ఇక ఇది ఇలా ఉంటే షోలో ఉన్నన్ని రోజులు, షో అయిపోయాక హౌస్ మేట్స్ పై ట్రోల్స్ చేస్తారు నెటిజన్లు .. అయితే ఒక్కోసారి ఈ ట్రోల్స్ వాటి పరిమితిని మించిపోతాయి.. హార్ట్ చేస్తాయి.. అలా బిగ్ బాస్ లో ఉన్నని రోజులు వితికా షెరు పైన కొన్ని ట్రోల్స్ జరిగాయి .. అయితే వీటివలన తానూ ఎం కోల్పోయింది. ఎలాంటి అవమానాలను ఎదురుకుందో ఆమె తాజాగా వెల్లడించారు.
ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది.. ఎందుకంటే.. ఎందుకంటే నాలా మరొకరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే . బిగ్ బాస్ తరువాత నా మెంటల్ కండిషన్.. సఫరింగ్.. డిప్రెషన్.. ట్రోలింగ్స్ వీటన్నింటి ద్వారా.. నేను ఏం కోల్పోయాను.. ఏం పొందుకోగలిగానో చెప్తానని వితికా చెప్ప్పుకోచ్చింది .. బిగ్ బాస్ అనేది నాకు చాలా గ్రేట్ జర్నీ.. ఈ షోకి వెళ్లేముందు నామీదా నాకు చాలా కాన్పిడెన్స్ ఉండేది. నేను ఎవరిపైనా ఆధారపడలేదు.. నేను ఇండిపెండెంట్ అండ్ పవర్ ఫుల్. నేను 11 ఏళ్ల నుంచి కష్టపడటం మొదలుపెట్టాను. అలాగే షో నుంచి బయటకు వచ్చాక కూడా నేను చాలా నాకంటే సక్సెఫుల్ ఉమెన్ ఉండదు అన్న భావన కలిగింది..
ఇక షో నుంచి ఎలిమినేట్ అయ్యాక మొత్తం కోల్పోయా... అయితే ఇక్కడ నేను ఎలిమినేట్ అయినందుకు బాధ లేదు.. అప్పటిదాకా నా ఇంట్లో వాళ్లు ఎంత బాధను అనుభవించారో చూడాల్సి వచ్చినందుకు అంటూ చెప్పుకొచ్చింది..నాలాగా నా ఫ్యామిలీ కూడా చాలా వీక్ అండ్ ఎమోషనల్.. షో లో ఉన్నప్పుడు, బయటకు వచ్చాక ఆ ట్రోల్, కామెంట్స్ చూస్తే బతకాలని అనిపించలేదు. ఎలిమినేట్ అయ్యాక అయితే ఓ మూడు వారాలైతే కోలుకోలేకపోయానని అంటూ వెల్లడించింది..
మనిషి బతికి ఉన్నప్పుడు చాలా మాట్లాడుతారు.. అదే వ్యక్తి చనిపోతే అయ్యోపాపం.. అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. మనిషి చనిపోయిన తరువాత ఫాలోవర్స్ పెరుగుతున్నారు. బిగ్ బాస్ 4 స్టార్ట్ అయ్యాక న్ని ట్రోలింగ్స్ పేజ్‌లు కూడా వచ్చేశాయి... ఇక మీమ్స్‌కి అయితే కొదువే లేదు.వాటిని చూసినప్పుడు బాధేస్తుంది. నా మాటలు విన్న వాళ్లలో ఒక్కరైనా ఆలోచిస్తారు. అభిప్రాయాన్ని మార్చుకుంటారని.. నా ఫ్యామిలీ నేను పడిన బాధ మరో ఫ్యామిలీ పడకూడదని ఈ మాటలు చెప్తున్నాను. డిప్రెషన్లోకి వెళ్తే ఎలా ఉంటుందో నేను చూశా.. అది క్యాన్సర్ కంటే ప్రమాదం అంటూ చెప్పుకోచ్చింది.
ఇక షో కివెళ్లేముందు నాకు చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. కానీ అదే షో నుంచి బయటకు వచ్చాక నా ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలేశారు..ఆ క్షణంలో నాకు చాలా బాధవేసింది. మనకి ఎప్పటికైనా తోడు ఉండేది.. ఫ్యామిలీ మాత్రమే అని తెలుసుకున్నాను. అప్పుడు నేను రియలైజ్ అయి నా ఫ్యామిలీకి మరింత దగ్గరయ్యానని వితికా వెల్లడించింది.. షోలో అంటే అలీ రీ ఎంట్రీ తరువాత జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పుకొచ్చింది వితికా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.