Samantha: రెండో పెళ్లిపై స్పందించిన సమంత.. ఏమన్నారంటే..?
Samantha: కొన్నేళ్లపాటు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Samantha: కొన్నేళ్లపాటు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్న నాగచైతన్య, సమంత ఆ తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్న ఈ కపుల్ ఇరువురు తమ అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడడంతో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక ఇప్పుడిప్పుడే ఆరోగ్యం నుంచి కోలుకుంటున్న సమంత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది. ఇందులో భాగంగానే తాజాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్దంగా ఉంది.
కాగా అటు నాగ చైతన్య కొన్ని రోజులుగా నటి శోభితతో ప్రేమలో ఉండగా.. తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరికొన్ని రోజుల్లోనే వివాహ బంధంలోకి ఎంటర్ కానున్నారు. దీంతో సమంత రెండో పెళ్లికి సంబంధించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నాగ చైతన్య వివాహం చేసుకున్న తరుణంలో సామ్ కూడా పెళ్లి చేసుకుంటుందని వాదనలు వినిపించాయి.
తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న నటి సమంతకు ఇదే ప్రశ్న ఎదురైంది. రెండో పెళ్లి చేసుకుంటున్నారా అన్న ప్రశ్నకు సమంత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. 'నేను ప్రేమించి వివాహం చేసుకున్నాను. కానీ ఆ తర్వాత విడిపోయాను. ఇక జీవితంలో రెండో వివాహం గురించి నేను ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో సమంత కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సమంత చేసిన ఈ కామెంట్స్‌పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. సామ్ మళ్లీ వివాహం చేసుకోవాలని కోరుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి సిటాడెల్ తర్వాత సమంత కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.