మీకేం హక్కుందని రాశారు.. ఆధారాలున్నాయా?.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఆగ్రహం..

Actress Pragathi: టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Update: 2023-10-30 06:46 GMT

మీకేం హక్కుందని రాశారు.. ఆధారాలున్నాయా?.. రెండో పెళ్లి వార్తలపై నటి ప్రగతి ఆగ్రహం..

Actress Pragathi: టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవల ఆమె ట్రెండింగ్ లోకి వచ్చింది. దానికి కారణం.. ఓ నిర్మాతను తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఆమె ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించింది. తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసి.. అసలు విషయం చెప్పింది. తన పర్సనల్ విషయాలు.. ఇలా ఎలాంటి అధారాలు లేకుండా ఎలా రాస్తారని మండిపడింది.

‘‘నేను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రముఖ మీడియా సంస్థలు కూడా వార్తలు రాశాయి. అవి చూడగానే ఎంతో బాధగా అనిపించింది. ఆధారాలు లేకుండా అలా రాయడం బాధ్యతా రాహిత్యం. నేను నటిని కాబట్టి మీరు ఏమైనా రాయొచ్చని అనుకోవడం తప్పు. మీకేం హక్కు ఉందని మరొకరి వ్యక్తిగత జీవితంపై ఇష్టమెచ్చినట్లు రాస్తారు. నేను ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నా. ఇక ముందైనా ఇలాంటివి రాసేముందు చెక్‌ చేసుకుని.. నిజానిజాలు తెలుసుకొని రాయండి. ఒకరి గురించి రాసేటప్పుడు హద్దులు మీరకూడదు. అసలు అలాంటిది ఏదైనా ఉంటే నేను చెబుతాను కదా! అంతేగానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నా ఆత్మగౌరవాన్ని ఇలా దెబ్బతీయడం సరైన పద్ధతి కాదు’’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రగతి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News