మొత్తానికి నా కల నెరవేరింది : పాయల్ రాజ్పుత్
Payal Rajput Dubs Her Voice In Telugu : తెలుగులో నటించే హీరోయిన్స్ కి వేరేవాళ్ళు డబ్బింగ్ చెబుతారు అన్న సంగతి తెలిసిందే..
Payal Rajput Dubs Her Voice In Telugu : తెలుగులో నటించే హీరోయిన్స్ కి వేరేవాళ్ళు డబ్బింగ్ చెబుతారు అన్న సంగతి తెలిసిందే.. కొందరు హీరోయిన్లు తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకోడానికి ఇష్టపడుతున్నారు.. ఇప్పటికే సమంత, కీర్తి సురేష్, తమన్నా లాంటి వాళ్ళు సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయింది పాయల్ రాజ్పుత్.. RX 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పాయల్ రాజ్పుత్.. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.
ఆ తర్వాత చేసిన రెండుమూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు... అయితే గత ఏడాది వెంకీ మామ, డిస్కో రాజా చిత్రాలు పర్వాలేదు అనిపించాయి.. ప్రస్తుతం ఈ భామ జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నరేంద్ర' అనే సినిమాలో నటిస్తోంది. ఇది ఇండో-పాక్ బోర్డర్ లో జరిగే కథతో రూపొందుతుంది. అయితే ఇందులో పాయల్ కీలక పాత్రలో నటిస్తోంది.
అయితే ఈ సినిమాలో తన పాత్రకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ.. నా కల నెరవేరింది.. తెలుగులో మొదటిసారి డబ్బింగ్ చెప్పాను అని వెల్లడించింది. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నారు మేకర్స్..
My first dub in telugu 🎬 pic.twitter.com/zuYFfEVBel
— paayal rajput (@starlingpayal) September 11, 2020