ప్రియుడి బర్త్‌డే.. నయన్ లక్షల్లో ఖర్చు..!
Nayantara Goa Trip : సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతారకి మంచి పేరుంది. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా బ్రేకప్ లతో కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ భామ..
Nayantara Goa Trip : సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతారకి మంచి పేరుంది. కేవలం సినిమాలతో మాత్రమే కాకుండా బ్రేకప్ లతో కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది ఈ భామ.. కేరియర్ ప్రారంభంలో హీరో శింబుతో రిలేషన్ ని మైంటైన్ చేసిన నయన్ ఆ తరువాత అతడికి బ్రేకప్ చెప్పేసి దర్శకుడు ప్రభుదేవాతో సహజీవనం చేసింది .. ఇక పెళ్లి వరకు వెళ్ళింది అనుకున్న వీరి ప్రేమ బ్రేకప్ తో ఎండ్ అయిపొయింది. ప్రస్తుతం నయన్ తమిళ స్టార్ డైరెక్టర్ విష్నేష్ శివన్‌తో రిలేషన్‌లో ఉంది.
ఎక్కడికి వెళ్లిన శివన్-నయనతార కలిసే వెళుతారు. బర్త్ డే వేడుకలు, క్రిస్మస్, ఓనమ్ ఇలా ఏ పండుగ వచ్చినా సరే ఈ ఇద్దరూ సెలబ్రేట్ చేసుకని దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా నయనతార గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విఘ్నేశ్ పుట్టినరోజును కూడా గోవాలో చాలా వేడుకగా జరిపారు. ఈ టూర్ కోసం నయన్ అక్షరాలా రూ.25 లక్షలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ప్రియుడి పుట్టినరోజు కోసం నయన్ ఇంత ఖర్చుపెట్టారా అని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
2015లో తెరకెక్కిన 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్ సమయంలో నయన్‌కి విఘ్నేశ్ శివన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక గత ఏడాది చిరంజీవి సైరా, విజయ్ విజిల్ సినిమాలతో సందడి చేసింది నయన్.. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రజనీకాంత్ దర్బార్ సినిమాతో సందడి చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది.