Tollywood Drugs Case: నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న నటి ముమైత్‌ఖాన్
* 2015 నుంచి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ పత్రాలతో విచారణకు హాజరుకావాలని ఆదేశించిన ఈడీ
Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు టాలీవుడ్ ప్రముఖుల్ని ఈడీ ప్రశ్నిస్తోది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్‌ప్రీత్, నందు, రవితేజ, రానా, నవదీప్‌లు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక ఇవాళ ముమైత్‌ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటి ముమైత్ ఖాన్ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అక్కడి నుంచి నేరుగా ఈడీ ఆఫీస్‌కు చేరుకోనున్నారు నటి ముమైత్ ఖాన్. ముమైత్ ఖాన్, కెల్విన్‌కు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. 2015 నుంచి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ పత్రాలతో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు ఆదేశించారు. కెల్విన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. 2017లో 10 గంటల పాటు ముమైత్‌ఖాన్‌ను విచారించారు ఎక్సైజ్ అధికారులు.
డ్రగ్స్ కేసులో మొదటగా విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్‌ను 10 గంటల పాటు విచారించారు అధికారులు. మనీ ల్యాండరింగ్‌తో పాటు ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై పలు ప్రశ్నలు వేశారు. ఆఫ్రికన్లకు మనీ ట్రాన్జాక్షన్లపై ఆరా తీశారు. ఆ తర్వాత హీరోయిన్లు ఛార్మిని 8 గంటలు, రకుల్‌ను 7 గంటలు విచారించారు. హీరో నందును 8 గంటల పాటు ఇంటరాగేషన్ చేశారు. ఇక రానా దగ్గుబాటిని 7 గంటలు.. హీరో రవితేజను 5 గంటలకు పైగా, నవదీప్‌ను 9 గంటలకు పైగా విచారించారు ఈడీ అధికారులు.